|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల

Published: 19-06-2025, 12:13 AM
నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన ‘కుబేర’ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా, ఒక రైతు కుటుంబానికి చేసిన సహాయం గురించి తెలిపారు. అగ్ని ప్రమాదంలో డబ్బులు కోల్పోయిన రైతుకు ఆయన రూ. 2 లక్షలు అందించారు.

Key Points

1

శేఖర్ కమ్ముల రూ. 2 లక్షలు సాయం చేశారు.

2

కూతురు పెళ్ళికి డబ్బులు కోల్పోయిన రైతుకు సహాయం.

4

గాంధీ ఆసుపత్రిలో రోగులకు భోజనం అందించారు.

రైతుకు శేఖర్ కమ్ముల సాయం

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల( Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. జూన్‌ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్‌ ప్రశ్నించారు.  ఒక రైతు కుటుంబానికి రూ. 2 లక్షలు  సాయం ఎందుకు శారో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్‌ కమ్ముల పలు విషయాలను పంచుకున్నారు.

కోవిడ్ సమయంలో చేసిన సేవలు

కూతురు పెళ్లి చేద్దామని  ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.  కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా కాలిపోవడంతో నేను బాగా ఎమోషనల్‌ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే బాధేస్తుంది..అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. దీంతో  ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే సాయం చేశాను.’ అని ఆయన చెప్పారు.  కోవిడ్‌ సమయంలో  ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ అమిగోస్‌ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు.

‘కుబేర’ చిత్ర ప్రమోషన్స్

2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన  కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం  బీరువాలో దాచుకున్న రూ.  లక్షలు మంటల్లో కాలిపోయాయి. ఆ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు  నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు  పంపించారు. అదే సమయంలో రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని కోరారు.

శేఖర్ కమ్ముల తన సహాయం గురించి మాట్లాడుతూ, మానవీయతను ప్రదర్శించారు. పేదలకు చేసే సహాయం ఎంతో ముఖ్యమని ఆయన నిరూపించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.