
విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన శివ బాలాజీ, తన అనుభవాలను, సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల గురించి మీడియాతో పంచుకున్నారు.
Key Points
శివ బాలాజీ 'కన్నప్ప' చిత్రంలో నటించిన అనుభవం గురించి మాట్లాడారు.
ప్రభాస్ మరియు విష్ణు మంచు మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
మోహన్ లాల్ మరియు అక్షయ్ కుమార్ పాత్రలు ఆశ్చర్యకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
సినిమా సెకండాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత రేంజ్ మారుతుందని చెప్పారు.
‘కన్నప్ప’ చిత్రంలో శివ బాలాజీ పాత్ర
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా.. మీడియాలో ముచ్చటించాడు శివ బాలాజీ. ‘‘కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదు అని విష్ణు అన్నారు. లేదు లేదు శివ బాలాజీ కచ్చితంగా ఉండాలి అని మోహన్ బాబు అన్నారు.
దీంతో ఆ తర్వాత కొన్ని రోజులకు మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా కన్నప్ప చిత్రంలోకి వచ్చేశాను. ‘కన్నప్ప’ చిత్రంలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రం, ప్యాన్ ఇండియన్ చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు. న్యూజిలాండ్‌లో మొత్తం రెండు నెలలు ఉన్నాను. ఈ సినిమాను నేను చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత రేంజ్ మారుతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది’ అంటూ అందరి క్యారెక్టర్స్ గురించి చెప్పుకొచ్చాడు శివ బాలాజీ.
ప్రభాస్ మరియు విష్ణు మంచు మధ్య సన్నివేశాలు
మోహన్ లాల్ మరియు అక్షయ్ కుమార్ పాత్రలు
శివ బాలాజీ ‘కన్నప్ప’ చిత్రం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభాస్, విష్ణు మంచుల నటన, మిగతా నటీనటుల పాత్రల గురించి ప్రశంసలు కురిపించారు. సినిమా చూడటానికి ప్రేక్షకులను ఆహ్వానించారు.


