|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహిళలపై వ్యాఖ్యలు: శివాజీ సారీ.. ‘మంచి ఉద్దేశమే కానీ’ అంటూ క్లారిటీ!

Published: 23-12-2025, 8:44 AM
మహిళలపై వ్యాఖ్యలు: శివాజీ సారీ.. 'మంచి ఉద్దేశమే కానీ' అంటూ క్లారిటీ!
  • నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు దండోరా సినిమా ఫంక్షన్‌లో చోటు చేసుకున్నాయి.
  • మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శివాజీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు.
  • తన ఉద్దేశం హీరోయిన్ల భద్రత గురించి మాట్లాడటమేనని శివాజీ వివరణ ఇచ్చారు.
  • ప్రసంగంలో వాడకూడని పదాలు ఉపయోగించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

నటుడు శివాజీ దండోరా సినిమా ఫంక్షన్‌లో మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం మంచిదేనని, హీరోయిన్ల భద్రత గురించే మాట్లాడానని శివాజీ వివరణ ఇచ్చారు. తప్పుగా వాడిన పదాలకు సారీ చెప్పారు.

దండోరా ఫంక్షన్‌లో శివాజీ వ్యాఖ్యలు

దండోరా సినిమా ఫంక్షన్‌లో నటుడు శివాజీ(Actor Shivaji) మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తాజాగా శివాజీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘‘నాలుగు మంచి మాటలు చెప్పాలని అనుకున్నాను.. ఈ క్రమంలోనే కొన్ని వాడకూడని పదాలు వాడాను.. ఆ మాటలు కూడా అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.. ముఖ్యంగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను.. ఇటీవల ఒకరిద్దరు హీరోయిన్లు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అభిమానులు వారిపట్ల మిస్ బిహేవ్ చేయడం, హీరోయిన్ల దుస్తులు కూడా చిరిగిపోయిన పరిస్థితులు మనం చూశాం. అందుకే అలా మాట్లాడాను.. ఏదేమైనా నా ప్రసంగంలో రెండు వాడకూడదని పదాలు వాడాను.. దానికి క్షమాపణ చెబుతున్నాను. నేను మహిళలను అమ్మవారిలా చూస్తాను.. స్త్రీలను ఎవరూ తక్కువగా చూడొద్దు.. చూసే అవకాశం వారు కూడా ఇవ్వొద్దు అనే ఉద్దేశంతో అలా చెప్పాను.. ఈ క్రమంలోనే రెండు వాడకూడని పదాలు వాడాను.. నా ఉద్దేశం మంచిదే కానీ.. సరైన పద్ధతిలో చెప్పలేకపోయాను.. ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే సారీ’’ అని శివాజీ వీడియోలో చెప్పుకొచ్చారు.

వివాదంపై శివాజీ వివరణ, క్షమాపణ

హీరోయిన్ల భద్రత కోసమేనా ఆ మాటలు?

మొత్తంగా, శివాజీ తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మంచిదే అయినా, పదాల ఎంపిక పట్ల జాగ్రత్త వహించలేదని అంగీకరించారు. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించమని కోరారు. ఈ వివాదంపై ఆయన ఇచ్చిన వివరణతో ప్రస్తుతానికి తెరపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.