|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగబాబు గుండెల్లో నాటుకుపోయే మాట చెప్పిన శోభన్‌ బాబు.. సోగ్గాడి ప్రశంసలకు మెగా బ్రదర్‌ ఎమోషనల్‌

Published: 22-07-2025, 11:41 AM
నాగబాబు గుండెల్లో నాటుకుపోయే మాట చెప్పిన శోభన్‌ బాబు.. సోగ్గాడి ప్రశంసలకు మెగా బ్రదర్‌ ఎమోషనల్‌

సినిమా, రాజకీయాలతో బిజీగా ఉన్న నాగబాబు, సీనియర్ నటుడు శోభన్ బాబుతో కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. శోభన్ బాబు చేసిన ప్రశంసలు, సలహాలు నాగబాబు హృదయాన్ని తాకిన విధానాన్ని ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

శోభన్ బాబు నాగబాబు నటనను ప్రశంసించారు.

2

నాగబాబు సీరియల్స్ చూసి శోభన్ బాబు ఆశ్చర్యపోయారు.

4

నాగబాబుకు శోభన్ బాబు మాటలు గుండెల్లో నాటుకున్నాయి.

శోభన్ బాబు ప్రశంసలు

మెగా బ్రదర్‌ నాగబాబు ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నారు. కొన్ని షోస్‌ చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు.

ఈ క్రమంలో నాగబాబు సోగ్గాడు శోభన్‌ బాబు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన తనకు చెప్పిన గొప్ప మాటని బయటపెట్టారు నాగబాబు. అది ఎప్పటికీ తన లైఫ్‌లో గుర్తుండిపోయిందని, దాన్నే తాను పాటించినట్టు తెలిపారు మెగా బ్రదర్‌.

నాగబాబు మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సక్సెస్‌ అయినంతగా సక్సెస్‌ కాలేకపోయారు. నిర్మాతగా బాగా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో హీరోగా రాణించలేకపోయారు.

కానీ నటుడిగా అలరిస్తున్నారు. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. అదే సమయంలో `జబర్దస్త్` జడ్జ్ గానూ ఆకట్టుకున్నారు.

మరోవైపు సీరియల్స్ కూడా చేసి అలరించారు. నటుడిగా సక్సెస్‌ అయ్యారు, కానీ మిగిలిన విషయాల్లో ఆయనకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.

నాగబాబు ఎమోషనల్ రియాక్షన్

కానీ నాగబాబుని నటుడిగా ఒక లెజెండరీ యాక్టర్‌ అభినందించడం విశేషం. అంతేకాదు నాగబాబు సీరియల్స్ ని ఆయన వీక్షించడం మరో విశేషం. ఆయన ఎవరో కాదు సోగ్గాడు శోభన్‌ బాబు.

తొలి తరం హీరోల్లో ఒకరిగా రాణించిన శోభన్‌ బాబు నాగబాబు నటించిన సీరియల్స్ చూశారట. బాగా చేశారని, ఆవి బాగున్నాయని అభినందించారట. ఈ విషయాన్ని నాగబాబు వెల్లడించారు. హిట్‌ టీవీ టాకీస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు నాగబాబు .

ఆ విషయాలను ఆయన పంచుకుంటూ.. అన్నయ్య చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పెళ్లి కార్డు ఇవ్వడానికి శోభన్‌బాబు ఇంటికి వెళ్లాడు నాగబాబు. ఆయన సీరియల్స్  చూస్తారట. అలా నాగబాబు నటించిన సీరియల్స్ కూడా చూాశారు.

నాగబాబు వెళ్లినప్పుడు శోభన్‌ బాబు  తనని అప్రిషియేట్‌ చేశారని, ఆయన అలా ప్రశంసిస్తుంటే తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు నాగబాబు. నన్నెవరు చూస్తారులే అనుకున్నాను, కానీ ఆయన టీవీ సీరియల్స్ చూస్తారట.

ఆ సమయంలో ఆయన సినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి ఇంట్లో రిలాక్స్ అవుతున్నారని తెలిపారు నాగబాబు. ఈ సందర్భంగా ఒక విషయం శోభన్‌ బాబు చెప్పారట. ఎలాంటి పరిస్థితి ఉన్నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారట.

తల్లిదండ్రుల ప్రేమ

`నాగబాబు గుర్తుపెట్టుకో, అమ్మానాన్నలను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకో. ప్రేమగా చూసుకో, అమ్మా నాన్నలకు ప్రత్యామ్నాయం లేదు` అని చెప్పారు శోభన్‌ బాబు.

అప్పటికే మేం అదే జోన్‌లో ఉన్నాం. బాగానే చూసుకుంటున్నాం.  కానీ ఆయన ఆ మాట అన్నాక, అది మరింత బలంగా తయారైంది, నా గుండెలో బలంగా నాటుకుపోతుంది` అని చెప్పారు నాగబాబు.

ఈ సందర్భంగా అందరిని ఉద్దేశించి ఆయన చెబుతూ, పేరెంట్స్ ఏం తప్పు చేశారు? ఏ నువ్వు వెళ్లి మాట్లాడలేవా? ఏ తండ్రి ఫెయిల్‌ కాదు. ఏరా నాన్న తిన్నావా? ఏం చేస్తున్నావ్‌ అంటే అందులో ప్రేమ లేదా?` అంటూ ప్రశ్నించారు నాగబాబు.

ఈ సందర్భంగా శోభన్‌ బాబు చెప్పిన ఆ మాటలు తనకు బలంగా నాటుకుపోయానని చెప్పారు నాగబాబు. ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

శోభన్ బాబు సలహా నాగబాబు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ ఎంతో ముఖ్యమని ఈ ఘటన మనకు తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.