|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ హీరోయిన్ శోభనకు అవమానం.. చెట్టు వెనకే అవి మార్చుకోమన్నారు!

Published: 08-06-2025, 10:21 AM
టాలీవుడ్ హీరోయిన్ శోభనకు అవమానం.. చెట్టు వెనకే అవి మార్చుకోమన్నారు!

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శోభన తాజా ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఒక అవమానకరమైన సంఘటనను గుర్తుచేసుకుంది. ఆమె అనుభవం చాలా మందికి ఆలోచింపజేస్తుంది.

Key Points

1

సినిమా షూటింగ్ సమయంలో శోభనకు ఎదురైన అవమానకరమైన అనుభవం.

2

బట్టలు మార్చుకోవడానికి కారవాన్ అడగగా, చెట్టు వెనుక మార్చుకోమని చెప్పడం.

4

అమితాబ్ బచ్చన్ శోభనకు కారవాన్ అందించి సహాయం చేసిన విషయం.

శోభన గుర్తు చేసుకున్న చేదు అనుభవం

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శోభన (Heroine Shobhana) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అప్పటి హీరోయిన్ శోభన తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని.. తాజాగా బయట పెట్టింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది శోభన. చెట్టు వెనక బట్టలు మార్చుకోమన్నారని… గుర్తు చేస్తూ ఎమోషనల్ అయింది సీనియర్ హీరోయిన్ శోభన.

చిత్ర బృందంపై శోభన మండిపాటు

అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా నటించిన ఓ సినిమాలోని సాంగ్ లో డాన్స్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో… బట్టలు మార్చుకునేందుకు కారవాన్ ( Caravan) అడిగితే… చెట్ల వెనుకకు వెళ్లి మార్చుకోమని.. తన పరువు తీసారని ఫైర్ అయింది. తనను చులకనగా చూస్తూ మాట్లాడారని చిత్ర బృందంపై మండిపడింది.

అమితాబ్ బచ్చన్ సహాయం

కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ విషయం తెలియగానే.. గొప్ప మనసుతో కారవాన్ ను తనకు ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పినట్లు.. వివరించింది సీనియర్ హీరోయిన్ శోభన. ఇది ఇలా ఉండగా… హీరోయిన్ శోభన… అప్పట్లో… మెగాస్టార్ చిరంజీవి లాంటి తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెరిసిన సంగతి తెలిసిందే.

శోభన తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, సినీ పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లను ప్రతిబింబిస్తుంది. అమితాబ్ బచ్చన్ మద్దతు ఆమెకు ఊరటనిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.