|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రష్టి వర్మ సంచలనం: వెండితెరపై మెరుపుతీగలా! ఆ పాటలో అంత special ఏముంది?

Published: 16-02-2026, 7:35 AM
శ్రష్టి వర్మ సంచలనం: వెండితెరపై మెరుపుతీగలా! ఆ పాటలో అంత special ఏముంది?
  • శ్రష్టి వర్మ ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలో ప్రత్యేక గీతంలో మెరవనుంది.
  • ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు.
  • ఈ చిత్రంలో సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
  • చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు, మేరు భాస్కర్ నిర్మాత.

శ్రష్టి వర్మ ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలో ప్రత్యేక గీతంతో వెండితెరకు పరిచయం కానుంది. జానీ మాస్టర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె, బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయింది. ఈ చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది.

‘ధర్మస్థల నియోజకవర్గం’లో శ్రష్టి వర్మ

Shrasti Verma: శ్రష్టి వర్మ.. ఈ పేరు ఆ మధ్య ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ విషయంలో వైరల్ అయిన ఈ పేరు.. ఆ తర్వాత బిగ్ బాస్‌ ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ‘బీబీ జోడి సీజన్ 2’లో మానస్ సరసన డ్యాన్స్ కంటెస్టెంట్‌గా శ్రష్టి వర్మ (Shrasti Verma) దుమ్మురేపుతోన్న విషయం తెలిసిందే. ఇక వెండితెర పరంగా ఇప్పటి వరకు తెర వెనుకే ఉన్న ఈ భామ, ఫస్ట్ టైమ్ వెండితెరపై మెరవబోతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్.. స్పెషల్ సాంగ్ ద్వారా వెండితెర అరంగేట్రం చేస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. అవును ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింది. ఆ సాంగ్‌కు సంబంధించిన వివరాలను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో డ్యాన్స్ మూవ్‌తో శ్రష్టి వర్మ ఆకర్షిస్తోంది. సినిమా వివరాల్లోకి వెళితే..

ప్రత్యేక గీతానికి చంద్రబోస్ సాహిత్యం

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ శ్రష్టి వర్మ డ్యాన్స్ నెంబర్‌‌తో ప్రేక్షకులను టీమ్ పలకరించబోతోంది. ఈ వారంలోనే ఈ సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించడం విశేషం. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ..

సినిమా విశేషాలు, నటీనటులు

‘‘ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ చాలా మంది నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ సాంగ్‌‌తో మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఈ సాంగ్‌లో శ్రష్టి వర్మ స్టెప్స్ అందరికీ కనువిందు చేస్తాయి. ఈ వారంలోనే సాంగ్‌ని రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌కు ఆమెనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌. అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు.

శ్రష్టి వర్మ వెండితెర ప్రవేశం ఒక సంచలనంగా మారింది. ఆమె డ్యాన్స్ నైపుణ్యం, చంద్రబోస్ సాహిత్యం ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.