|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్ళికి ముందే స్టార్ హీరోకి పుట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా? టాలీవుడ్‌లో సంచలనం!

Published: 28-01-2026, 12:35 AM
షాకింగ్: పెళ్ళికి ముందే స్టార్ హీరోకి పుట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా? టాలీవుడ్‌లో సంచలనం!
  • శృతి హాసన్ 40వ పుట్టినరోజు వేడుకలు, సెలబ్రేషన్స్‌లో ఫ్యాన్స్!
  • కమల్ హాసన్, సారికల లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో శృతి జననం
  • ‘సలార్ 2’, ‘కూలీ’ సినిమాలతో శృతి ఫుల్ బిజీ, పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుదల!
  • రెండుసార్లు ప్రేమలో విఫలం.. పెళ్లి చేసుకోకుండా శృతి సింగిల్ లైఫ్ ఎంజాయ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం! పెళ్ళికి ముందే ఒక స్టార్ హీరోయిన్ జన్మించింది అంటే నమ్ముతారా? ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మన శృతి హాసన్! ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ, సొంత టాలెంట్ తో ఎదుగుదల!

40వ ఏడాదిలోకి అడుగుపెట్టింది స్టార్ హీరోయిన్  శ్రుతి హాసన్.  ఇండియన్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. సొంత ట్యాలెంట్ తో ఎదిగింది బ్యూటీ. అయితే శృతీ హాసన్ కమల్ కు పెళ్లికి ముందే కలిగిన సంతానం.  సారిక, కమల్ హాసన్‌ లివ్-ఇన్‌లో ఉన్నప్పుడే సారిక గర్భవతి అయింది.

శ్రుతి హాసన్‌కు 2 ఏళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు. 1988లో కమల్, సారిక పెళ్లి  చేసుకోగా.. వారికి  రెండో కూతురు అక్షర జన్మించింది. చాలాకాలం కలిసి ఉన్నాక, 2004లో శ్రుతి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

టాలీవుడ్‌లో శృతి హాసన్ సంచలనం.. బ్లాక్ బస్టర్ హిట్స్!

స్కూల్లో చదివేటప్పుడు తాను ఫేక్ పేరు వాడినట్టు శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ఫిల్మ్ స్టార్స్ కూతురునని ఎవరికీ తెలియకూడదనే అలా చేసినట్టు చెప్పింది. ఆమె తన పేరును పూజా రామచంద్రన్‌గా మార్చుకుంది. ఆతరువాత కాలంలో ఆమె తన అసలు పేరును రివిల్ చేసినట్టు సమాచారం..

శ్రుతి 6 ఏళ్లకే ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆతరువాత కాలంలో  ‘హే రామ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరమీదకు వచ్చింది. కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించిన శ్రుతి హాసన్..  2009లో ‘లక్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ లాంటి సినిమాలు చేసినా, బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ కాలేదు.

40 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్!

హిందీతో పాటు సౌత్ సినిమాల్లోనూ శ్రుతి నటించింది. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత, గబ్బర్ సింగ్  బలుపు, ఎవడు, రేసుగుర్రం, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ లాంటి హిట్స్ కొట్టింది.

శ్రుతి హాసన్ వర్క్‌ఫ్రంట్ చాలా భారీగా ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ప్రస్తుతం తే, ఆమె ‘ట్రైన్’, ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ సినిమాల్లో కనిపించనుంది. రీసెంట్ గా  రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో కూడా ఆమె నటించింది. 40 ఏళ్లు వచ్చినా.. పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్.. రెండు సార్లు ప్రేమలో పడి.. బ్రేేకప్ చెప్పేసింది.

శృతి హాసన్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ఆమె నటిస్తున్న ‘సలార్ 2’ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.