
📌 Key Points
- శృతి హాసన్ ఒక చిన్నారికి అరుదైన వ్యాధి నయం చేయడంలో సహాయం చేసింది.
- ఆ చిన్నారికి ఎముక మజ్జ మార్పిడి కోసం ఆర్థికంగా అండగా నిలిచింది.
- శృతి, వైద్య నిపుణులతో మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందించేలా చూసింది.
- చిన్నారి ఆళ్వీ, తన తల్లిదండ్రులతో కలిసి శృతిహాసన్‌ను కలిసింది.
సినీ నటి శృతిహాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. శృతిహాసన్ చేసిన ఈ సహాయానికి అందరూ ఫిదా అవుతున్నారు.
చిన్నారికి అండగా నిలిచిన శృతి
Shruti Haasan: సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఒక్కొక్కసారి సినిమాల ద్వారానే కాకుండా.. అప్పుడప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మొదలుకొని మహేష్ బాబు(Maheshbabu) తో పాటు ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినిమాల ద్వారా వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరులకు కేటాయిస్తూ మంచి పేరు ఘడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో హీరోలే కాదు హీరోయిన్లు కూడా తక్కువ ఏమీ కాదు అంటున్నారు. అందులో భాగంగానే తాజాగా స్టార్ కిడ్, ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan)గొప్ప మనసు చాటుకుంటూ ఒక చిన్నారి పాలిట దేవతగా మారింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి అండగా నిలిచి.. ఆ చిన్నారి ఆ వ్యాధిని జయించేలా చేసింది.
ఇకపోతే ఈ విషయాన్ని శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేస్తూ ఆ చిన్నారితో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది. విషయంలోకి వెళ్తే.. ఆళ్వి అని చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే చాలా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి వచ్చింది. ఇక పుట్టినప్పటి నుండి హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ఫలితం లభించలేదు. 2025లో ఆ చిన్నారికి ఎముక మజ్జ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కావలసిన డబ్బు లేక ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విషయం కాస్త శృతిహాసన్ కి చేరడంతో ఆమె ఆ కుటుంబానికి అండగా నిలిచింది. పాప పరిస్థితి సీరియస్ అయి ఐసీయూలో ఉన్నప్పుడు శృతిహాసన్ డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఏకంగా రంగంలోకి దిగి బెస్ట్ డాక్టర్లతో మాట్లాడి.. ఆ పాపకు మెరుగైన వైద్యం అందించేలా చూసింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులను ఆ ఫ్యామిలీకి పరిచయం చేసి ఆ పాప ప్రాణాలు కాపాడింది. ఇక వైద్యంతో పాటు అటు మానసికంగా , ఆర్థికంగా కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది శృతిహాసన్.
వైద్యం అందించడంలో సహాయం
ఇకపోతే ఇటీవల ఆ చిన్నారి ఆళ్వీ తన తల్లిదండ్రులతో కలిసి శృతిహాసన్ ని కలవగా ఆ సమయంలో శృతి ఆ పాపతో ఆడుకుంటున్న వీడియోని తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇకపోతే ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ..”ఈరోజు మా పాప ఇలా ఈరోజు బ్రతికి ఉందంటే అది కేవలం శృతి గారి వల్లే “అంటూ ఆ పాప తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు మొత్తానికైతే శృతిహాసన్ గొప్ప మనసుకి అభిమానులు ఫిదా అవుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు నెటిజన్స్ కూడా శృతిహాసన్ మంచి మనసుకి ఫిదా అవుతున్నారు.
శృతిహాసన్‌ను కలిసిన ఆళ్వీ కుటుంబం
శృతిహాసన్ విషయానికి వస్తే.. చివరిగా రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. కానీ కొన్ని కారణాలవల్ల తప్పుకుంది ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు ది ఐ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ప్రభాస్ సలార్ 2 లో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే
Tags Shruti Haasan tollywood Share
మొత్తానికి, శృతిహాసన్ చేసిన ఈ సహాయం అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె గొప్ప మనసును చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె నిజంగానే దేవత అని నిరూపించుకున్నారు.


