
📌 Key Points
- సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం.
- మొత్తం 300 సీట్లలో సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లలకు 150 సీట్లు కేటాయింపు.
- EWS అభ్యర్థులకు అదనంగా 15 సీట్లు, ప్రభుత్వ కోటాలో 150 సీట్లు అందుబాటులో.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 8; నాణ్యమైన విద్య, ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారు.
సింగరేణి సంస్థ తన ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ పాలిటెక్నిక్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలో 300 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇది కార్మిక సంక్షేమంలో ప్రభుత్వ నిబద్ధతను చాటుతుంది.
అడ్మిషన్ల వివరాలు, సీట్ల కేటాయింపు
Singareni Polytechnic Admissions 2026 : సింగరేణి సంస్థ పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా నస్పూర్ (CCC) లో ఏర్పాటు చేసిన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ (SCP) కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ కళాశాలలో మొత్తం 300 సీట్లు అందుబాటులో ఉండగా… వీటిని ఎస్సీసీఎల్ మేనేజ్‌మెంట్ కోటా కింద 150 సీట్లు, ప్రభుత్వ కోటా కింద 150 సీట్లుగా విభజించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 150 సీట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…
అర్హతలు, దరఖాస్తు విధానం
మేనేజ్‌మెంట్ కోటాలోని ఈ 150 సీట్లకు కేవలం సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు. వీటికి అదనంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) అభ్యర్థుల కోసం మరో 15 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో చేరాలనుకునే సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ నెల 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్ తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు. కళాశాలలో చేరే అభ్యర్థులకు నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక సదుపాయాలతో పాటు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామని కాలేజ్ యాజమాన్యం వెల్లడించింది.
కళాశాల ప్రత్యేకతలు, భవిష్యత్తు అవకాశాలు
అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ల కొరకు అధికారిక ఆన్‌లైన్ లింక్ https://scp.scpolytechnic.com/counseling/ ను సందర్శించవచ్చు. అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8790112515, 9908151618, 9010222161 మొబైల్ నంబర్లలో లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కళాశాల యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా కోరింది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
సింగరేణి పాలిటెక్నిక్ అడ్మిషన్లు సింగరేణి కుటుంబాలకు గొప్ప అవకాశం. నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


