|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ సంచలనం: నన్ను బ్లాక్ మెయిల్ చేశారు! లాయర్‌పై సంచలన ఆరోపణలు!!

Published: 12-04-2026, 8:00 AM
మంగ్లీ సంచలనం: నన్ను బ్లాక్ మెయిల్ చేశారు! లాయర్‌పై సంచలన ఆరోపణలు!!
  • మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు!
  • అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్ మెయిల్ చేశారని మంగ్లీ ఆరోపణ.
  • బిగ్ బాస్ కు వెళ్లేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఫైర్.
  • బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్న మంగ్లీ!

సింగర్ మంగ్లీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన సంచలన ఆరోపణలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు మంగ్లీ ఎవరిపై బ్లాక్ మెయిల్ ఆరోపణలు చేసింది? ఈ కథలో నిజమెంత?

బ్లాక్ మెయిల్ ఆరోపణలు చేసిన మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో (Micro Finance Scam) సింగర్ మంగ్లీ (Singer Mangli) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు (Advocate Subba Rao) నన్ను డబ్బు డిమాండ్ చేశారని డబ్బు ఇవ్వనందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాగుట్ట పీఎస్‍కు వచ్చిన మంగ్లీ.. న్యాయవాది సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుబ్బారావుపై ఫిర్యాదు చేసిన సింగర్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంగ్లీ.. నా పేరుతో ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే అవన్నీ తనకు తెలియడానికి నేనైమైనా దేవతనా అని ప్రశ్నించారు. నేను మామూలు మనిషినే అన్నారు. తనకు విషయం తెలియగానే బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మూలాలను మర్చిపోలేనన్నారు. నాకు డబ్బు ముఖ్యం కాదని డబ్బే ముఖ్యం అనుకుంటే 2023 తెలంగాణలో, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనకు రాజకీయ ప్రచారం చేస్తే కోట్లకు కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా నేను వాటిని తిరస్కరించానన్నారు.

మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్

తనకు పాటలు పాడడం మాత్రమే తెలుసని తన ప్రపంచం అదేనని చెప్పారు. తనకు డబ్బు కాదు వ్యక్తిత్వం ముఖ్యం అన్నారు. ఎవరినో చూపిస్తూ తన తమ్ముడు అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంతో తన పాత్ర లేదని ఒక వేళ ఉందని తేలితే అందుకు నేను దేనికైనా సిద్ధం, కానీ ఈ కేసులో నా ప్రమేయం లేదని తేలితే సుబ్బారావును ఏం చేస్తారని మీడియాను ప్రశ్నించారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానన్నారు.

మంగ్లీ ఆరోపణలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.