|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ కన్నీటి వెనుక నిజమెంత? మైక్రో ఫైనాన్స్ కేసులో ఊహించని ట్విస్ట్!

Published: 15-04-2026, 12:05 PM
మంగ్లీ కన్నీటి వెనుక నిజమెంత? మైక్రో ఫైనాన్స్ కేసులో ఊహించని ట్విస్ట్!
  • మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీకి సంబంధం లేదని మధు వెల్లడించారు.
  • హేమాకాంత్ రెడ్డి 20 కోట్లు తీసుకున్నాడని మధు ఆరోపించారు.
  • న్యాయవాది సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి స్నేహితులని మధు తెలిపారు.
  • నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని మంగ్లీ విజ్ఞప్తి చేసింది.

ప్రముఖ సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో తన పేరు వినిపించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు తనను కావాలనే ఇరికించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అసలు నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.

మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ పేరు?

Singer Mangli: జానపద గేయాలతో ఉనికిని చాటుకొని ఆ తర్వాత సినిమా పాటలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli).గత నాలుగు రోజులుగా మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావు అనే న్యాయవాది మంగ్లీ పైన కేసు వేయడం ,అటు మంగ్లీ తిరిగి ఆ న్యాయవాదిపై కేసు పెట్టడం అన్నీ సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన వ్యక్తిగా ఉన్న మధు ఇప్పుడు అప్రూవర్ గా మారారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మైక్రో ఫైనాన్స్ కేసుకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు. హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు ..కంపెనీలో పెట్టిన సుమారుగా 20 కోట్లను ఆయనే తీసుకున్నాడు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరూ కూడా స్నేహితులు అంటూ కుండబద్దలు కొట్టారు.

మరోవైపు ఈ విషయంపై మంగ్లీ మాట్లాడుతూ.. మీడియా ముందు మరోసారి కన్నీటి పర్యంతం అయింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా అమ్మానాన్నలే కదా అతిపెద్ద ఎమోషన్. కానీ మీడియాలో, టీవీలో ఈ కేసుకు సంబంధించి నా ఫోటోలు చూసిన ప్రతిసారి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి కదా ..మీడియాలో చూపే విధానాన్ని బట్టే ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నన్ను ఇలా తప్పుగా చూపించడం వల్ల అటు సోషల్ మీడియాకి వచ్చే లాభం ఏంటి ? దయచేసి ఈ వివాదంలో నా ఫోటోలను వాడకండి. నేను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే స్వయంగా నేనే జైలుకు వెళ్తాను. నేను ఏ తప్పు చేయలేదు. అందరికీ నిజాలు తెలిసినా.. అసత్యాలు ప్రచారం చేయడం వల్ల మా కుటుంబం మానసికంగా వేదన అనుభవిస్తోంది మీ ఇంటి ఆడబిడ్డను కూడా ఇలాగే ఏడిపిస్తారా ? నేను కూడా మీ ఇంటి ఆడబిడ్డ నే కదా.. దయచేసి నిజా నిజాలు తెలియకుండా తప్పుడు ప్రచారాలు చెయ్యకండి అంటూ కన్నీటి పర్యంతం అయింది మంగ్లీ. ప్రస్తుతం మంగ్లీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ప్రమేయం లేకుండానే ఆమెను ఈ కేసులో ఇరికించారనే వార్తలు ఇప్పుడు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మధు నోరు విప్పడంతోనే అసలు నిజాలు బయటకు వచ్చాయి.

మధు సంచలన ఆరోపణలు

ఇదే మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. “నేను మానసికంగా ఎంతో కుమిలిపోతున్నాను . ఎక్కడ ఏం జరిగిందో అంతా విచారణ చేసుకోండి ..నాకు పాటలే ప్రపంచం. ఇది తప్ప ఏమీ తెలియదు.. ప్రజలారా.. సామాజిక మాధ్యమాలలో ప్రసారమయ్యే వాటిని ఎవరు కూడా నమ్మకండి .. ముఖ్యంగా కొందరు పెట్టే కామెంట్లు చూసి కుమిలిపోతున్నాను. నా వల్ల అసలు కావడం లేదు నాకు పాటలు పాడడమే వచ్చు.. ఇలా స్కాములు చేయడం తెలియదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంగ్లీ.

కన్నీటి పర్యంతమైన మంగ్లీ

మొత్తానికి ఈ కేసులో ప్రధాన నిందితుడు నోరు విప్పడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మంగ్లీ ఈ కేసులో ఇరికించబడిందని స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.