|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంతకు తప్పని వాయిదా! చరణ్ దెబ్బకు ‘బంగారం’ వెనక్కి.. అసలు కథ ఇదే!

Published: 04-05-2026, 5:45 PM
సమంతకు తప్పని వాయిదా! చరణ్ దెబ్బకు 'బంగారం' వెనక్కి.. అసలు కథ ఇదే!
  • సమంత ‘మా ఇంటి బంగారం’ సమ్మర్ సీజన్‌లో విడుదల కావాల్సింది, కానీ వాయిదా పడింది.
  • రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న వస్తుండటంతో సమంత టీమ్ షాకైంది.
  • పెద్ద సినిమాతో పోటీ పడకుండా, సోలో రిలీజ్ కోసం సినిమా వెనక్కి తగ్గింది.
  • ‘శాకుంతలం’, ‘ఖుషి’ తర్వాత సమంతకు ఈ సినిమా విజయం చాలా ముఖ్యం.

సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల వాయిదా పడింది. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు కావడంతో, బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు సమంత టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం.

సమ్మర్ సీజన్ మిస్సైన ‘మా ఇంటి బంగారం’

Ma Inti Bangaram: సందడి చేయాల్సిన సమ్మర్ సీజన్ సరైన సినిమాలు లేక వెలవెలబోతుంది.ఇలాంటి టైంలో ‘మా ఇంటి బంగారం’ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తే కచ్చితంగా కలెక్షన్ల వర్షం కురిసేది. ‘ఓ బేబీ’లో లేని మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండటం సమంతకు పెద్ద ప్లస్ అయ్యేదన్నది ట్రేడ్ వర్గాల మాట.

మంచి ఛాన్స్  వదులుకుందనే కామెంట్స్

అటు సూర్య ‘వీరభద్రుడు’ కూడా మే 14న రావడం డౌట్ అనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ అది కూడా పోస్ట్ పోన్ అయ్యింటే, సమంతకు తమిళంలో కూడా ఎదురు ఉండేది కాదు. కానీ అనవసరపు లెక్కలు వేసి సమంత ఒక మంచి ఛాన్స్ ని  వదులుకుందనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.మరో వైపు అనవసరపు రిస్క్ తీసుకోవడం కంటే, కాస్త వెనక్కి తగ్గి సోలో రిలీజ్ దక్కించుకోవడమే ఉత్తమమంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చరణ్ ‘పెద్ది’ దెబ్బకు సమంత షాక్

‘పెద్ది’ జూన్ 4న రాదనే ధీమాతోనే

ఇన్ సైడ్  టాక్ ప్రకారం.. ‘పెద్ది’ జూన్ 4న రాదనే ధీమాతోనే సమంత టీమ్ మే 15 డేట్ ని లైట్ తీసుకున్నారట. తీరా చరణ్ సినిమా డేట్ ఫిక్స్ చేయడంతో సామ్ టీమ్ షాక్ తిన్నట్లు సమాచారం. ఎందుకంటే చరణ్ సినిమా జూన్ 4న వస్తోంది అంటే, దానికి కనీసం రెండు వారాల ముందు, రెండు వారాల తర్వాత ఏ చిన్న సినిమా ఉన్నా కలెక్షన్లపై దెబ్బ పడటం పక్కా .ముఖ్యంగా ‘పెద్ది’ పీరియాడిక్ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్ లో క్రేజ్ మాములుగా లేదు.ఒకవేళ సమంత సినిమా మే 15న వస్తే, కేవలం రెండు వారాల్లోనే థియేటర్లను ఖాళీ చేయాల్సి ఉంటుంది.తన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమంతకు ఇది ఒకరకంగా గట్టి దెబ్బే అని చెప్పాలి. టీజర్ చూస్తుంటే సినిమా ప్రామిసింగ్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు జూన్ మూడో వారం లేదా జూలై వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు.

సమంతకు ఈ సినిమా చాలా కీలకం

సమంతకు ఈ సినిమా ఎందుకు కీలకం?

మాములుగా పాన్ ఇండియా సినిమాలు పోస్ట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు కానీ, ‘మా ఇంటి బంగారం’ లాంటి మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇలా వాయిదాల పాట పాడటం ఇండస్ట్రీకి అంత మంచిది కాదు కూడా.ఏది ఏమైనా సమంతకు ఈ సినిమా చాలా కీలకం . ‘శాకుంతలం’, ‘ఖుషి’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో’మా ఇంటి బంగారం’తో తప్పక హిట్టు కొట్టాల్సిన పరిస్థితి.అందుకే చరణ్ సినిమాతో పోటీ పడి కలెక్షన్లు పంచుకోవడం కంటే, కాస్త వెనక్కి తగ్గి సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది .

ఇక సమంత మా ఇంటి బంగారం బాటలోనే  సత్యదేవ్  ‘రావు బహదూర్’ కూడా నడిచే చాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.చూడాలి మరి సర్కులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎలా ఎప్పుడు రియాక్ట్ అవుతారో !

మొత్తానికి, బాక్సాఫీస్ వద్ద అనవసరపు పోటీని నివారించి, సాలిడ్ హిట్ కొట్టాలనే లక్ష్యంతోనే ‘మా ఇంటి బంగారం’ వాయిదా పడింది. సమంతకు ఈ సినిమా విజయం ఎంత అవసరమో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.