|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ కేసులో సంచలనం! సీపీ సజ్జనార్‌ను కలిసిన సింగర్.. అసలేం జరిగింది?

Published: 14-04-2026, 6:35 AM
మంగ్లీ కేసులో సంచలనం! సీపీ సజ్జనార్‌ను కలిసిన సింగర్.. అసలేం జరిగింది?
  • మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీపై అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు.
  • తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు.
  • దుష్ప్రచారంపై సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన మంగ్లీ.
  • సుబ్బారావు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఆరోపణ.

ప్రముఖ సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసు వివాదంలో చిక్కుకున్నారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మంగ్లీపై అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు

Singer Mangli: ప్రముఖ సినీ గాయని మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు వివాదంలో భాగంగా ఈమె సుమారు150 మంది వరకు మోసం చేసింది అంటూ అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పై ఆరోపణలు చేయడంతో మంగ్లీ ఈ ఆరోపణలను ఖండించారు. ఇలా తన పట్ల అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఈమె ఇదివరకే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ కేసు వివాదం గురించి ఈమెక్ సిటీ సిపి సజ్జనార్(CP Sajjanaar) ను కలిశారు. తన గురించి సోషల్ మీడియాలోనూ ఇతర ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఈమె కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా అడ్వకేట్ సుబ్బారావు తన గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు చేస్తున్నారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాల కారణంగా తనకు వ్యక్తిగత బంగం కలుగుతుందని ఈమె ఆరోపించారు. గత కొద్ది రోజులుగా కావాలనే నన్ను టార్గెట్ చేస్తూ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న లాయర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈమె సజ్జనార్ ను కోరారు. ఇక బాధితులకు న్యాయం చేయాలని ఈమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీపీ సజ్జనార్‌ను కలిసిన మంగ్లీ

ఈ కేసు విషయంలో తనపై మాత్రమే కాకుండా పలువురి బాధితులపై కూడా ఇలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయని బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్న సుబ్బారావు ఇలాంటి చర్యలకు పాల్పడటం తప్పు అని వెంటనే ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ మంగ్లీ కోరారు. ఈ విధంగా మంగ్లీ ఫిర్యాదు చేయడంతో సజ్జనార్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించడమే కాకుండా వెంటనే విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట చాలామంది దగ్గర ఇలాగే డబ్బులు వసూలు చేసిందని లాయర్ సుబ్బారావు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ వెళ్లాలనే కోరిక..

దుష్ప్రచారంపై మంగ్లీ ఫిర్యాదు

మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరి కొంతమంది పేర్లపై ఈయన కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశాన్ని మంగ్లీ తీవ్రంగా ఖండిస్తూనే వచ్చారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై ఈ విధమైనటువంటి దుష్ప్రచారం మొదలు పెడుతున్నారని సుబ్బారావు ఫేమస్ అవడం కోసమే తనని టార్గెట్ చేశారని మంగ్లీ తెలిపారు. ముఖ్యంగా సుబ్బారావుకు బిగ్ బాస్ వెళ్లాలని చాలా కోరికగా ఉంది అందుకే బిగ్ బాస్ అవకాశం కోసం ఈ విధంగా తన పేరును అడ్డుపెట్టుకొని వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అవుతున్నారని తెలిపారు. ఆయన ఆరోపణలు చేసిన విధంగా తాను ఎక్కడైనా మోసానికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని తెలిపారు.

మంగ్లీ ఫిర్యాదుపై సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.