
📌 Key Points
- సింగర్ మంగ్లీ మైక్రోఫైనాన్స్ వివాదంలో చిక్కుకున్నారు.
- వందల కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలను మంగ్లీ ఖండించారు.
- తన పరువుకు నష్టం కలిగించే వీడియోలను తొలగించాలని కోర్టును ఆశ్రయించారు.
- మంగ్లీ సోదరుడి ఖాతాకు నగదు బదిలీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ మైక్రోఫైనాన్స్ వివాదంలో చిక్కుకున్నారు. వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమె, తనపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన పరువును కాపాడుకునేందుకు మంగ్లీ కోర్టును ఆశ్రయించారు.
మంగ్లీపై మైక్రోఫైనాన్స్ ఆరోపణలు
Singer Mangli: సింగర్ మంగ్లీ ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ కేసు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈమె మైక్రో ఫైనాన్స్ పేరిట పలువురు దగ్గర వందల కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని వారిని మోసం చేశారు అంటూ ఆరోపణలు రావడమే కాకుండా బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలు కారణమైంది.. ఇలా మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా సింగర్ మంగ్లీ పెట్టేసి కూడా నమోదు అయ్యాయి. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఉద్దేశం పూర్వకంగానే తనపై ఇలాంటి అప్పుడు ఆరోపణలు చేస్తూ తనని దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ మంగ్లీ ఖండిస్తూ వచ్చారు. అయితే మంగ్లీ సోదరుడు బ్యాంకు ఖాతాకు మధు అనే వ్యక్తి అకౌంటు నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ఇలా ఈ కేసు విషయంలో పోలీసుల కీలక ఆధారాలను రాబట్టిన నేపథ్యంలో మంగ్లీ చిక్కుల్లో పడుతుందని భావించారు అయితే ఈమె ఈ కేసు నుంచి బయటపడటం కోసం ఏకంగా కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో ఈమె హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో ఆశ్రయించారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఈమె ఫిర్యాదు చేశారు.తన పరువుకి నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ ఈమె కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
ఈ వ్యవహారంలో కొంతమంది ముందస్తు ప్రణాళికలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసారని కోర్టుకు తెలియజేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం చేసిన అసత్యపు వార్తలను ,అందుకు సంబంధించిన వీడియో, లింకుల కూడా తొలగించి తన గురించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా చూడాలని ఈమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణ అనంతరం తన గురించి తప్పుడు వార్తల ప్రచారం చేసిన యూట్యూబ్ చానళ్లకు నోటీసులు ఇవ్వాల్సిందిగా ఈమె కోరారు. ఇలా తన గురించి వచ్చినటువంటి ఆరోపణలలో నిజం లేదంటూ కోర్టును ఆశ్రయించిన మంగ్లీకి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో తెలియాల్సి ఉంది.
అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు..
అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు
ఇక ఈ మైక్రో ఫైనాన్స్ విషయంలో భాగంగా అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పై ఆరోపణలు చేయడమే కాకుండా తనపట్ల కేసు కూడా నమోదు చేశారు. అయితే బాధితులు తనని సంప్రదించడంతోనే కేసు నమోదు చేశానని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. ఇక ఈ విషయంలో మంగ్లీ తనకు డబ్బు ఆశ చూపించి ఈ కేసు విత్ డ్రా చేసుకోవాలని కోరారని, అలా కానీ నేపథ్యంలో తన అనుచరుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మంగ్లీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ సుబ్బారావు కూడా తన వాదనను వినిపించారు. మరి మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా మంగ్లీ ఎలా బయటపడుతుందనేది తెలియాల్సి ఉంది.
మంగ్లీ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, పరువు నష్టం కేసుతో కోర్టును ఆశ్రయించడం ఈ వివాదానికి కొత్త మలుపునిచ్చింది. ఈ కేసు విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో, మంగ్లీకి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.


