
📌 Key Points
- సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
- మోసం చేశారంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది.
- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంగ్లీని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది.
- మంగ్లీ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు, కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని అంటున్నారు.
సింగర్ మంగ్లీ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసులో ఆమెపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ఆరోపణలు
Singer Mangli: సింగర్ మంగ్లీ ఇటీవల కాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈమె మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా పెద్ద ఎత్తున ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 150 మంది వరకు ఈమె మోసం చేశారని వారి వద్ద నుంచి కొన్ని కోట్ల రూపాయలను తీసుకున్నారు అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు చేశారు దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే మంగ్లీ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
ఇక ఈ కేసులో భాగంగా మంగ్లీ ఇప్పటికే ఉన్నతాధికారులను కలిసి తన గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి అంటూ ఈమె కంప్లైంట్ చేశారు. ఈ కేసుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని, కొంతమంది ఉద్దేశం పూర్వకంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కేసులు పెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇలా మంగ్లీ తన తప్పు లేదని చెబుతున్నప్పటికీ ఈ వివాదం మాత్రం ఓ కొలికి రాలేదని చెప్పాలి. అయితే తాజాగా మంగ్లీకి మా అసోసియేషన్ నుంచి ఊహించని షాక్ ఎదురైంది.
మా అసోసియేషన్ ఫిర్యాదు, బహిష్కరణ డిమాండ్
మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంపత్ నాయక్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మంగ్లీపై ఫిర్యాదు చేశారు. సంపత్ నాయక్ మంగ్లీని ఫిలిం ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా నిరుపేదలకు న్యాయం జరిగే వరకూ మంగ్లీని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అంటూ సంపత్ నాయక్ ఫిర్యాదు చేయడంతో ఈమెకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి.
మరి ఈ ఫిర్యాదులపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజంగానే సింగర్ మంగ్లీ పై వేటు పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటివరకు మంగ్లీ ఈ విషయంపై ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. మంగ్లీని బ్యాన్ చేయాలి అంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆమె స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. అయితే మంగ్లీ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నప్పటికీ కొంతమంది బాధితులు మాత్రం బయటకు వచ్చి స్వయంగా మంగ్లీ ఫ్లాట్లోనే తాము డబ్బులు ఇచ్చామని ఆమెను చూసే డబ్బులు ఇచ్చాము అంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.
మంగ్లీ స్పందన కోసం ఎదురుచూపులు
మొత్తానికి, మంగ్లీ పై వస్తున్న ఆరోపణలు ఆమె కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.


