|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీ వర్సెస్ లాయర్: పోలీస్ స్టేషన్‌లో హై డ్రామా! అసలు కథేంటి?

Published: 11-04-2026, 11:35 AM
మంగ్లీ వర్సెస్ లాయర్: పోలీస్ స్టేషన్‌లో హై డ్రామా! అసలు కథేంటి?
  • మంగ్లీ, ఆమె సోదరుడు శివపై రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలు.
  • రియల్ ఎస్టేట్, ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో మోసం చేశారని బాధితుల ఆరోపణ.
  • తనను వేధిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని లాయర్‌పై మంగ్లీ ఫిర్యాదు.
  • వీడియోలను వైరల్ చేసి కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని మంగ్లీ ఆరోపణ.

ప్రముఖ సింగర్ మంగ్లీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె మరియు ఆమె సోదరుడు శివపై మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతిగా, తనను లాయర్ వేధిస్తున్నాడని మంగ్లీ ఆరోపించడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలు

Mangli Controversy :ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన మంగ్లీ ఇపుడు ‘మైక్రో ఫైనాన్స్’కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.ముఖ్యంగా ఈ వివాదం వెనకాల ఏకంగా 150కోట్ల స్కామ్ ఉందన్న టాక్ రావడం తో ఫిలిమ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపొయింది.విషయంలోకి వెళ్తే సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది సుభా సింగబోష్ గత వారమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టిన సంగతి తెల్సిందే.మంగ్లీ,ఆమె తమ్ముడు శివ కలిసి కలిసి మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 150మంది బాధితుల నుండి దాదాపు రూ.10కోట్ల వరకు వసూలు చేశారని,ఈ డబ్బును రియల్ ఎస్టేట్ మరియు ట్రేడింగ్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి భారీ లాభాలు ఇస్తామని ఆశ పెట్టి ఇప్పుడు పత్తా లేకుండా పోయారని తన కంప్లైంట్ లో చెప్పుకొచ్చారు.మంగ్లీ బాధితులు స్వయంగా తనని కాంటాక్ట్ అయ్యారని అందుకే తాను ఇందులో ఇన్వాల్వ్ అయ్యానని తెలిపారు.

లాయర్ పైనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేస్

ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ ఆరోపణలపై స్పందించింది మంగ్లీ.ఇదంతా తనపై జరుగుతున్న పెద్ద కుట్ర అని తనపై కేసు పెట్టిన లాయర్ పైనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టింది.ఇలా ఒకరిమీద ఒకరు కేసులు ఫైల్ చేసుకోవడంతో ఈ కేసిప్పుడు మరింత హాట్ టాపిక్ అయిపొయింది.అసలు మార్చి21వ తేదీన సుభా సియపోగు అనే వ్యక్తి తనను పరిచయం చేసుకుని,అప్పటి నుండి తనను మానసికంగా వేధిస్తున్నాడని,తనకు ఏమాత్రం సంబంధం లేని కొన్ని కరెన్సీ కట్టల వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశారని,తనను పర్సనల్‌గా కలవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె తన కంప్లైంట్ లో చెప్పుకొచ్చింది మంగ్లీ.తను చెప్పినట్టు వినాలని,లేకపోతె కెరీర్‌ను నాశనం చేస్తానని,తన పరువు తీస్తానని బెదిరించాడని తెలిపింది.

లాయర్‌పై మంగ్లీ సంచలన ఆరోపణలు

ఇదంతా ఫేక్ అంటూ ఇప్పటికే మంగ్లీ క్లారిటీ

నిజానికి ఏప్రిల్ మొదటి వారం నుండి సోషల్ మీడియాలో మంగ్లీకి సంబంధించివి అంటూ కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.యూట్యూబ్‌లో కూడా కరెన్సీ నోట్ల వీడియోలు తెగ సర్క్యులేట్ అవడంలో ఇందులో నిజమెంత అన్న డైలామాలో పడిపోయారంతా.ఇక ఇదంతా ఫేక్ అంటూ ఇప్పటికే మంగ్లీ వీటిపై క్లారిటీ ఇచ్చింది కూడా.తనకు పాటలు పాడటం,ప్రొఫెషనల్ ఈవెంట్స్ చేయడం తప్ప తనకు,తన తమ్ముడికి ఎలాంటి బిజినెస్ లు లేవని,ఇక సర్క్యులేట్ అవుతున్నట్టుగా మైక్రో పైనాన్స్ ఇష్యూతో అసలు ఎలాంటి లింక్ లేనే లేదని కుండ బద్దలు కొట్టేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ఈ ఫైనాన్స్ పంచాయితీ ఎక్కడ తేలుతుందో

ఒకవైపు అసలు బాధితులు నావద్ద ఉన్నారంటూ లాయర్ పెట్టిన కేసు పంజాగుట్టలో ఉంటె,మరో వైపు నన్ను మానసికంగా బెదిరించి,వేదిస్తున్నారంటూ మంగ్లీ పెట్టిన కేస్ నార్సింగ్ లో ఉంది.దీంతో మార్చి21న ఆ లాయర్ మంగ్లీని ఎందుకు కలిశారు?ఆ వైరల్ వీడియోల వెనుక ఎవరి హస్తం ఉంది అనే విషయాలపై లోతుగా దర్యాప్తు మొదలయినట్టు తెలుస్తుంది.ఇక ఈ కేస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు వేణు ఉడుగుల ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే.చూడాలి మరి సింగర్ వర్సెస్ లాయర్ అన్నట్టుగా సాగుతున్న ఈ ఫైనాన్స్ పంచాయితీ ఎక్కడ తేలుతుందో!

మంగ్లీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు నిజం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఈ వివాదం ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.