|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ సంచలన హెచ్చరిక: “నా వ్యక్తిగత విషయాల జోలికి వద్దు!” దండోరా ప్రమోషన్స్‌లో అసలు కథ బయటపెట్టిన నటుడు.

Published: 26-12-2025, 10:21 AM
శివాజీ సంచలన హెచ్చరిక: "నా వ్యక్తిగత విషయాల జోలికి వద్దు!" దండోరా ప్రమోషన్స్‌లో అసలు కథ బయటపెట్టిన నటుడు.
  • నటుడు శివాజీ మహిళలపై చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి.
  • వ్యక్తిగత విషయాలపై రచ్చ చేయవద్దని మీడియాకు శివాజీ విజ్ఞప్తి.
  • `దండోరా` సినిమా విజయం సాధించి, పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.
  • “ప్రతి మాటకు ఓ కారణం ఉంటుంది” అంటూ తన వ్యాఖ్యలను శివాజీ సమర్థించుకున్నారు.

ఇటీవల మహిళలపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాలపై ఆయన స్పందిస్తూ, తన వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని హెచ్చరించారు. తన కొత్త చిత్రం `దండోరా` ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఒక కారణం ఉంటుందని వివరించారు.

శివాజీ కామెంట్స్ పై రచ్చ

నటుడు శివాజీ ఇటీవల మహిళలపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశం అవుతుంది. ఏ న్యూస్‌ ఛానెల్‌ చూసినా దీని మీదనే డిబేట్లు పెడుతున్నాయి. శివాజీ అనుచితంగా కామెంట్‌ చేయడం, అనసూయ, చిన్మయి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌ వంటి వారు స్పందించడం, దీనికి శివాజీ కౌంటర్లు ఇవ్వడం, ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడం నడుస్తూనే ఉంది. అయితే చాలా మంది మహిళలు శివాజీని సపోర్ట్ చేయడం గమనార్హం.

తాజాగా శివాజీ ఈ పరిణామాలపై స్పందించారు. ఆయన `దండోరా` మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నందు, బిందు మాధవి, నవదీప్‌, రవికృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ గురువారం విడుదలైంది. దీనికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కులం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ క్రమంలో శుక్రవారం థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేసింది టీమ్‌. ఇందులో శివాజీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

“వ్యక్తిగత విషయాల జోలికి వద్దు”: శివాజీ హెచ్చరిక

సినిమాలో బిందు మాధవి, శివాజీ మధ్య లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. అయితే ఆ ట్రాక్‌ని పెద్దగా చూపించలేదు. ఎప్పుడు మీ మధ్య ప్రేమ పుట్టిందనే ప్రశ్న ఎదురైంది. దీనికి శివాజీ స్పందిస్తూ, మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు ఒక కంపెనీ కావాలి. ఆ కంపెనీ కోసం వాడు ఖర్చుపెట్టుకుని వెళ్లాడు. ఎక్కడో ఓ చోట ఏదో కనెక్షన్‌ దొరికింది. ఈ జీవితంలో ఎవరు ఎందుకు కలుస్తారో, ఎవరికీ తెలియదు. నోట్లో నుంచి ఎప్పుడు ఎందుకు వస్తుందో తెలియదు. కానీ నేచరల్‌లో ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది` అని తెలిపారు శివాజీ. అంటే ఆయన ఎందుకు అలా మాట్లాడాడో, దానికి ఒక కారణం ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు.

ఇక తన వివాదం గురించి స్పందిస్తూ, తన వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లొద్దని తెలిపారు. `ప్లీజ్ నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకండి. వాటి గురించి కాకుండా `దండోరా` సినిమాని ప్రమోట్ చేయండి. లేదంటే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది. కావాలంటే నేను థియేటర్‌కు వస్తాను. ఏం మాట్లాడాలన్నా నేను అక్కడ మాట్లాడతాను` అని తెలిపారు శివాజీ. పరోక్షంగా ఇక దీనిపై రచ్చ వద్దని  చెప్పడం గమనార్హం.

దండోరా సినిమా విశేషాలు, సక్సెస్ టాక్

దండోరా మూవీ గురించి శివాజీ మాట్లాడుతూ, సినిమాని రెండు రోజుల ముందు ప్రీమియర్స్ వేస్తే వేరే లెవల్‌లో ఉండేదని తెలిపారు. సెన్సార్‌ వల్ల డిలే అయ్యిందని తెలిపారు. ఈ సినిమా చూసి హనుమాన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూట్‌ చేయ‌డం ఫస్ట్ టైమ్‌. నా దర్శకుడు నీల‌కంఠ‌ అయితే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. `ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. మ‌ల‌యాళ సినిమా డైరెక్ట‌ర్స్‌, మారి సెల్వ‌రాజ్ వంటి డైరెక్ట‌ర్‌తో పోల్చి ముర‌ళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ చేస్తునన్ని రోజులు నేను రోజుకి 2 గంట‌లే ప‌డుకునేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు.. పాత్ర‌లుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే పాత్ర‌లో ఆ లుక్ క‌నిపించాలి. డైరెక్ట‌ర్ అడ‌గ‌క‌పోయినా నేను క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఆదరించాల`ని తెలిపారు శివాజీ.

మొత్తంగా, శివాజీ వివాదం ఒక పక్క కొనసాగుతుండగా, మరోపక్క ఆయన నటించిన `దండోరా` సినిమా మంచి విజయం సాధించింది. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి సినిమాను ప్రమోట్ చేయాలని శివాజీ విజ్ఞప్తి చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.