|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sobhita Dhulipala: మరిది పెళ్లి జ్ఞాపకాలు పంచుకున్న శోభిత.. అదే నా సీక్రెట్‌ అంటూ..

Published: 16-06-2025, 4:01 AM
Sobhita Dhulipala: మరిది పెళ్లి జ్ఞాపకాలు పంచుకున్న శోభిత.. అదే నా సీక్రెట్‌ అంటూ..

అఖిల్ అక్కినేని వివాహ వేడుకల్లో పాల్గొన్న నటి శోభిత ధూళిపాల, ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె లుక్ గురించి వచ్చిన విమర్శలకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Key Points

1

అఖిల్ అక్కినేని పెళ్లి వేడుకల్లో శోభిత ధూళిపాళ అందంగా కనిపించింది.

2

ఆమె పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

4

ఎవరేమనుకున్నా పట్టించుకోకపోవడమే తన సీక్రెట్ అని శోభిత తెలిపింది.

అఖిల్ అక్కినేని పెళ్లి వేడుకలు

కింగ్‌ అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni ) తీరిక లేకుండా వరుస పనులతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు. ఆ తర్వాత షూటింగ్స్‌లో మునిగాడు. ఈ నెలలో (జూన్‌ 6న) చిన్నకుమారుడు అఖిల్‌ వివాహం జరిపించాడు. అతడు ప్రేమించిన అమ్మాయి జైనబ్‌ రవ్జీతోనే ఘనంగా పెళ్లి జరిపించి ఆమెను చిన్న కోడలిగా స్వీకరించాడు. పెళ్లి సింపుల్‌గా అయిపోయినా రిసెప్షన్‌ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది.

శోభిత ధూళిపాల ఫోటోలు

అందంగా ముస్తాబైన శోభిత తాజాగా చై సతీమణి, హీరోయిన్‌ శోభిత ధూళిపాళ ( Sobhita Dhulipala ) జూన్‌ ముచ్చట్లు అంటూ కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. అందులో అఖిల్‌ పెళ్లి సెలబ్రేషన్స్‌లో తను ముస్తాబైన పిక్స్‌ను పంచుకుంది. ఓ ఫోటోలో ఆరెంజ్‌ డ్రెస్‌లో శోభిత చాలా అందంగా మెరిసిపోగా.. మరోదాంట్లో మామ నాగార్జునను ఆత్మీయంగా హత్తుకుంది. అలాగే బరాత్‌ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫోటోను కూడా యాడ్‌ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేశామని చెప్పకనే చెప్పింది.

ట్రోలింగ్‌కు శోభిత సమాధానం

ట్రోలర్స్‌కు కౌంటర్‌? పనిలో పనిగా ఓ సీక్రెట్‌ చెప్పింది. నా సీక్రెట్‌ ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటున్నారు? అసలేం జరుగుతుందనేది పట్టించుకోకపోవడమే అని కృష్ణమూర్తి చెప్పిన మాటను యథాతథంగా పొందుపరిచింది. అఖిల్‌ పెళ్లిలో శోభిత లుక్‌పై చాలానే ట్రోల్స్‌ వచ్చాయి. తను.. నాగచైతన్య పక్కన భార్యలా కాదు, ఆంటీలా ఉందని కొందరు నెగెటివ్‌ కామెంట్లు చేశారు. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌, లుక్‌పైనా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ కౌంటర్‌గానే ఐ డోంట్‌ కేర్‌ అనే సందేశాన్ని యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

అఖిల్ పెళ్లిలో తన అనుభవాలు, ఫోటోలను పంచుకున్న శోభిత, ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా ఉండటమే తన సీక్రెట్ అని చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.