|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sobhita: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత.. సామ్ గుర్తులను పూర్తిగా చెరిపేస్తోందిగా?

Published: 11-12-2025, 1:48 AM
Sobhita: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత.. సామ్ గుర్తులను పూర్తిగా చెరిపేస్తోందిగా?
  • నవీన్ పోలిశెట్టి నాగచైతన్యను ‘చై’ అని పిలవగా శోభిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • సమంత నాగచైతన్యను ‘చై’ అని పిలిచేదని, అందుకే శోభిత సీరియస్ అయ్యారని నెటిజన్లు అంటున్నారు.
  • శోభిత సమంత జ్ఞాపకాలను, గుర్తులను పూర్తిగా చెరిపేసే పనిలో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాగచైతన్యను నవీన్ పోలిశెట్టి ‘చై’ అని పిలవగా శోభిత ధూళిపాళ్ల సీరియస్ అయ్యారు. సమంత నాగచైతన్యను ‘చై’ అని పిలిచేవారు కాబట్టి, శోభిత ఆమె జ్ఞాపకాలను చెరిపేస్తున్నారని నెటిజన్లు ఊహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత

Sobhita: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య (Nagachaitanya)ను గత ఏడాది వివాహం చేసుకొని అక్కినేని కోడలుగా కొనసాగుతున్నారు. ఇక నాగచైతన్య సమంత(Samantha) విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత (Sobhita)వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల నాగచైతన్య శోభిత కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హీరో సుశాంత్, నవీన్ పోలిశెట్టి వంటి తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి వేదికపై మాట్లాడుతూ చై ఇటు రా నువ్వే ఇక్కడ మెయిన్ అని మాట్లాడారు వెంటనే శోభిత అందుకొని తనని చై అని కాదు చైతూ అని పిలవండి అంటూ కాస్త సీరియస్ గానే చెప్పారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నాగచైతన్యను సమంత చై అని పిలిచేది.. దీంతో చైతన్య’ చై’ గానే అందరికీ పరిచయం కానీ సమంత జ్ఞాపకాలను, గుర్తులను చెరిపేసే పనిలో శోభిత ఉన్నారని తాజాగా ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

సమంత జ్ఞాపకాలను చెరిపేస్తున్నారా?

నాగచైతన్యను ఇకపై ఎవరు చై అని పిలవకూడదు అంటూ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. అలా పిలవడం శోభితకు నచ్చలేదని అందుకే అంత సీరియస్ అయ్యారు అంటూ మరి కొంతమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా క్రమక్రమంగా శోభిత నాగచైతన్య, సమంతకు సంబంధించి జ్ఞాపకాలను తుడిచేస్తున్నారు. ఇక నాగచైతన్య శోభిత ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె కూడా దర్శకుడు రాజ్ ను రెండవ వివాహం చేసుకున్నారు.

ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం చైతన్య కార్తీక్ వర్మ దరకత్వంలో వృషకర్మ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మైథాలజికల్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక చైతు చివరిగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీక్ వర్మ వృషకర్మ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

వైరల్ అవుతున్న వీడియో.. నెటిజన్ల స్పందన

శోభిత చర్యతో నాగచైతన్య, సమంత పాత జ్ఞాపకాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సమంత గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో శోభిత ఉన్నారని నెటిజన్లు విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం ఇంకా హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.