|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేధింపుల విషాదం: ఆఫీసులోనే అధికారి ఆత్మహత్య! కన్నీటి వీడ్కోలు!!

Published: 21-03-2026, 9:05 AM
వేధింపుల విషాదం: ఆఫీసులోనే అధికారి ఆత్మహత్య! కన్నీటి వీడ్కోలు!!
  • కర్ణాటకలో సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
  • జిల్లా డైరెక్టర్ కృష్ణప్ప వేధింపులే కారణమని సూసైడ్ వీడియోలో ఆరోపణ
  • తన చావుకు ఎవరూ ప్రతీకారం తీర్చుకోవద్దని మృతుడి విజ్ఞప్తి
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కర్ణాటకలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమకూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జున్ తన కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. తన పై అధికారి వేధింపుల వల్లే చనిపోతున్నట్టు ఆయన ఆరోపించారు.

వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్య

తన పై అధికారి వేధింపులు తాళలేక ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన చావుకు కారణం అయిన అధికారిపై తన కుటుబం సభ్యులెవరూ ప్రతీకారం తీర్చుకోవద్దని అతడిని దేవుడు లేదా చట్టమే శిక్షిస్తుందంటూ మరణానికి ముందు రికార్డు చేసిన వీడియో వైరల్‍గా మారింది. కర్ణాటకలో (Karnataka) జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. తమకూరు జిల్లాలో సాంఘీక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‍గా పని చేస్తున్న మల్లికార్జున్ పావగడ ప్రాంతంలోని అప్ప బండేలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోనే శుక్రవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ కు ముందు ఆయన తన సహచరులకు ఒక వీడియో సందేశాన్ని పంపాడు. అందులో తన శాఖకే చెందిన జిల్లా డైరెక్టర్ కృష్ణప్ప తనను తీవ్రంగా వేధిస్తున్నారని, ఆ వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

సూసైడ్ వీడియోలో మల్లికార్జున తన కుటుంబాన్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. నా తల్లి, భార్య, పిల్లలు నా కుటుంబం నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. నేను వారికి ఎంతో సహాయం చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకున్నారు. తన మరణానికి కారణమైన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ.. కృష్ణప్ప చేసే వేధింపుల వల్లే నేను ఈ అడుగు వేస్తున్నాను. దేవుడే అతడిని శిక్షిస్తాడని చెప్పాడు. నా కుటుంబ సభ్యులు ఎవరూ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవద్దని పేర్కొన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సూసైడ్ వీడియోలో సంచలన ఆరోపణలు

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.