
తెలుగు బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన గౌతమ్ కృష్ణ, తన తాజా చిత్రం ‘సోలో బాయ్’ ఓటీటీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చాడు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథ, ఓటీటీ విడుదల తేదీ గురించి తెలుసుకుందాం.
Key Points
గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్' సినిమా ఓటీటీలోకి రానుంది.
థియేటర్ రిలీజ్ తర్వాత త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం.
సినిమాలో మధ్యతరగతి కుర్రాడు మిలియనీర్‌గా ఎలా ఎదిగాడో చూపించారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
సోలో బాయ్ ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. సీజన్ 7, 8లో పార్టిసిపేట్ చేశాడు. సీజన్ 8లో రన్నరప్ గానూ నిలిచాడు. అశ్వత్థామ 2.0 అంటూ హడావుడి చేశాడు. ఆ తర్వాత సోలో బాయ్ సినిమాతో థియేటర్లకు వచ్చాడు గౌతమ్. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ పై గౌతమ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ మూవీ ఇంకా థియేటర్లలో ఉంది.
సోలో బాయ్ సినిమా జూలై 4న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే కంటే కూడా రెండో రోజు, మూడో రోజు కలెక్షన్లు బెటర్ గా వచ్చాయి. కానీ గౌతమ్ ఆశలు పెట్టుకున్నట్లు ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంకా థియేటర్లో ఉండగానే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి గౌతమ్ కృష్ణ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
‘‘ సోలో బాయ్ త్వరలనే మీ ఇళ్లలోకి వస్తున్నాడు. ఓటీటీలో కమింగ్ సూన్’’ అనే క్యాప్షన్ తో ఫొటోలు పోస్టు చేశాడు గౌతమ్ కృష్ణ.
సినిమా కథాంశం: మధ్యతరగతి నుంచి మిలియనీర్‌గా
సోలో బాయ్ ఓటీటీ రిలీజ్ పై గౌతమ్ కృష్ణ పోస్టు చూస్తుంటే ఈ సినిమా ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (జూలై 18) ఓటీటీలోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే ఏ ఓటీటీలోకి వస్తుందన్న దానిపై క్లారిటీ లేదు. ఆహా ఓటీటీ ఏమైనా పోటీలో ఉందా? లేదంటే ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లు రైట్స్ సొంతం చేసుకున్నాయా? చూడాలి.
ప్రేమలో ఫెయిల్, పెళ్లిలో ఫెయిల్, తండ్రి మరణం.. ఈ కష్టాలన్నీ దాటుకుని హీరో మిలియనీర్ గా ఎలా ఎదిగాడన్నదే సోలో బాయ్ మూవీ. కృష్ణమూర్తిది (గౌతమ్ కృష్ణ) మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి అతడిని ఇంజినీరింగ్ చదివిస్తుంటారు. కాలేజీలో ప్రియ (రమ్య పసుపులేటి) అనే అమ్మాయిని కృష్ణమూర్తి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. గొప్పింటి అమ్మాయి అయిన ప్రియ… కృష్ణమూర్తిని అవమానిస్తుంది.
అతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రియ దూరమైన బాధలో తాగుడుకు బానిసగా మారిపోతాడు కృష్ణమూర్తి. శృతి (శ్వేతా అవస్థి) అనే అమ్మాయి కారణంగా ఆ విఫల ప్రేమ బాధ నుంచి బయటపడతాడు. శృతితో కృష్ణమూర్తి జీవితం ఎలా సాగింది? కృష్ణమూర్తిని ప్రాణంగా ప్రేమించిన శృతి అతడికి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఈ కష్టాలను దాటుకుంటూ తన లక్ష్యాన్ని కృష్ణమూర్తి ఎలా చేరుకున్నాడు అన్నదే సోలో బాయ్ మూవీ కథ.
గౌతమ్ కృష్ణ అప్డేట్
మిడిల్ క్లాస్ టూ మిలియనీర్స్
మిడిల్‌క్లాస్ నుంచి మిలియనీర్స్‌గా మారిన వారి కథలు అప్పుడప్పుడు పేపర్లలో, టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన సినిమానే సోలో బాయ్. విఫల ప్రేమలు, కష్టాలను, కన్నీళ్లను దాటుకుంటూ ఓ మిడిల్ క్లాస్ యువకుడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.
తెలుగు బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ నటించిన సోలో బాయ్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విజయం గౌతమ్ కృష్ణ కెరీర్ లో మరో మైలురాయి.


