
📌 Key Points
- ప్రకాశం జిల్లాలో దారుణం: కన్నతల్లిని నిప్పంటించి చంపిన కొడుకు.
- మాంసం దుకాణం నడుపుతున్న కిషోర్ బాబు, మతిస్థిమితం లేదని స్థానికుల కథనం.
- వృద్ధురాలు వెంకట రమణమ్మను హత్య చేసిన కిషోర్ బాబు పరారీ.
- పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, స్థానికంగా కలకలం.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. కన్నతల్లిని సొంత కొడుకే నిప్పంటించి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలులో కలకలం రేపిన ఘటన
తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి.. ప్రయోజకుడిని చేయాలనుకున్న ఆ తల్లికి, తన ప్రాణాలు తీసే యముడు తన కడుపునే పుడతాడని తెలియదు. లోకం నిద్రపోతున్న వేళ, ఇంట్లో ఉన్న కొడుకే కాలయముడిగా మారి కన్నతల్లిని ఆహుతి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలును ఉలిక్కిపడేలా చేసింది.
ఒంగోలు నగరంలోని వెంకట రమణమ్మ అనే వృద్ధురాలు తన పెద్ద కుమారుడు కిషోర్ బాబుతో కలిసి నివసిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున, ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ.. ఆ ఇంట్లో మాత్రం నిప్పుల్లో ఓ తల్లి మృతిచెందింది.
మాంసం దుకాణం నడుపుకొనే కిషోర్ బాబు, తల్లి గాఢనిద్రలో ఉండగా ఇంటికి నిప్పు పెట్టాడు. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి.. ఆ మంటల మధ్య ఆమె అరుపులు కూడా బయటకు రాకుండానే ఆ వృద్ధురాలు బూడిదైపోయింది.
మంటలు రావడం గమనించిన స్థానికులు పరుగున వచ్చి చూడగా, కిషోర్ బాబు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏం జరిగిందని నిలదీస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది.
పరారీలో నిందితుడు కిషోర్ బాబు
వెంకట రమణమ్మ విగతజీవిగా పడి ఉంది. నిందితుడు కిషోర్ బాబుకు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతోంది. చిన్న కుమారుడు చెన్నై లో స్థిరపడి ఉన్నా, పెద్ద కొడుకు వద్దే ఉంటూ తన బాధ్యత నెరవేర్చుకుంటున్న తల్లికి.. చివరికి ఇలాంటి విషాదాంతం ఎదురుకావడం బాధాకరం. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన కిషోర్ బాబు కోసం గాలిస్తున్నారు.
తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పుపెట్టడంపై స్థానికంగా కలకలం రేగింది. మంటలు చెలరేగడం చూసి ఇరుగుపొరుగువారు.. షాక్ అయ్యారు. కొడుకు కిషోర్ బాబును అడగ్గా.. సరైన సమాధానాలు చెప్పలేదు. గట్టిగా జనాలు పైకి వెళ్లి ప్రశ్నించగా.. భయంతో అక్కడ నుంచి పారిపోయాడు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్థానికులు ఓ వైపు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు వచ్చారు. పైపుల సాయంతో ఎగిసిపడుతున్న మంటలను నీళ్లు కొట్టి అదుపు చేశారు.. కానీ అప్పటికే ఇంట్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. వెంకట రమణమ్మ మంటల్లో కాలి బూడిదైంది.
కిషోర్ బాబుకు మతిస్థిమితం లేదని చెబుతున్నప్పటికీ.. హత్యకు గల అసలైన కారణాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.


