|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొడుకు వయసు 21.. ప్రియుడి వయసు 33.. మరోసారి ప్రేమలో 52ఏళ్ల హాట్ బ్యూటీ

Published: 01-11-2025, 6:27 AM
కొడుకు వయసు 21.. ప్రియుడి వయసు 33.. మరోసారి ప్రేమలో 52ఏళ్ల హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 52 ఏళ్ల వయసులో 33 ఏళ్ల యువకుడు హర్ష్ మెహతాతో ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ప్రేమ వ్యవహారం, వారి వయసు తేడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Key Points

1

52 ఏళ్ల వయసులో మలైకా అరోరా, 33 ఏళ్ల హర్ష్ మెహతాతో ప్రేమలో పడింది.

2

గతంలో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా కొత్త బంధంలోకి అడుగుపెట్టింది.

4

ఈ వయసు తేడా ప్రేమపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

మలైకా అరోరా – కొత్త ప్రేమకథ

హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి ప్రేమలో పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్బాజ్ ఖాన్‌తో పెళ్లి బంధంలో కొడుకు అర్హాన్ ఖాన్(21)కు జన్మనిచ్చిన ఆమె.. దశాబ్దాల బంధం తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా వినబడింది. కానీ అనుకోకుండా బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక తాజాగా మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. 52ఏళ్ల వయసున్న ఆమె 33ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హర్ష్ మెహతా అనే యువకుడితో ఓ ఈవెంట్‌లో క్లోజ్‌గా కనిపించడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. హర్ష్ మెహతాకు బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉండగా.. వ్యాపారవేత్తగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కాగా ఈ జంటను చూసిన నెటిజన్లు కొందరు నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతుండగా.. మరికొందరు మాత్రం ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించబడిందని కామెంట్ చేస్తున్నారు.

హర్ష్ మెహతా ఎవరు?

నెటిజన్ల స్పందన

మలైకా అరోరా కొత్త ప్రేమపై నెట్టింట మిశ్రమ స్పందన ఉంది. ప్రేమకు వయసు హద్దులు లేవని కొందరు అంటుంటే, మరికొందరు వయసు తేడాపై చర్చించుకుంటున్నారు. ఈ జంట భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.