
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 1xBet యాప్ ప్రచారంతో ఆయన సంబంధంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీతారలు, క్రికెటర్లు విచారణ ఎదుర్కొన్నారు.
Key Points
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో సోనూ సూద్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
1xBet యాప్ ప్రచారంతో సోనూ సూద్ సంబంధంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో పలువురు సినీతారలు, క్రికెటర్లు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు.
మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
ఈడీ విచారణకు సోనూ సూద్ హాజరు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో(betting app case) ఈడీ విచారణకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సోనూసూద్‌కు ఈడీ ముందుకు వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి ఆయనకు గతంలోనే ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు సోనూ సూద్ విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనూసూద్‌తో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వారిని కూడా విచారించారు. నిషేధిం ఉన్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా చిక్కుల్లో పడ్డారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది.
1xBet యాప్ ప్రచారంపై దర్యాప్తు
మనీలాండరింగ్ ఆరోపణలు
ఈ కేసులో మరిన్ని వివరాలు వెలువడే వరకు వేచి చూడాలి. సోనూ సూద్‌పై ఉన్న ఆరోపణలపై ఈడీ విచారణ కీలకంగా మారుతోంది.


