
📌 Key Points
- సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గి, చదువుపై దృష్టి కోల్పోతున్నారు.
- లైక్స్, షేర్ల కోసం ఆతృతతో మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
- ఆన్‌లైన్ బుల్లీయింగ్, స్కామ్‌ల వంటి ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.
- 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేధం అవసరమని సోనూసూద్ సూచించారు.
నటుడు సోనూసూద్ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాను నిషేధించాలని కోరారు. డిజిటల్ ప్రపంచం పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వారి నిజమైన బాల్యాన్ని కాపాడాలని ఆయన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం: ఆందోళనలు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల జీవనశైలిలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ కంటెంట్ చూసే అలవాటు పెంచుకుంటున్నారు. ఇది వారిలో ఏకాగ్రత తగ్గిపోవడానికి, చదువుపై దృష్టి సరిగా నిలకడగా లేకపోవడానికి కారణమవుతోంది. ఇకపోతే, సోషల్ మీడియాలో అందరి జీవితాలు అన్నీ పర్ఫెక్ట్‌గా కనిపించడం వల్ల పిల్లలు తమను వాళ్లతో పోల్చుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ చిన్న చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం దెబ్బతినే పరిస్థితి వస్తోంది. అదే సమయంలో, డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడంతో స్కామ్‌లు, నకిలీ అకౌంట్స్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ వంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
సోనూసూద్ పిలుపు: నిషేధం అవశ్యకత
పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు గుర్తించలేని పరిస్థితి. ఇవి మాత్రమే కాదు.. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోగా, భావోద్వేగ సంబంధాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. నిజమైన ఆటలు, బయట తిరుగుడు, స్నేహితులతో గడిపే ఆ అనుభూతులు అన్ని డిజిటల్ స్క్రీన్‌ల మధ్యే కరిగిపోయాయి. తాజాగా, ఈ విషయంపై సోనూసూద్ (Sonu Sood)ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. పిల్లలు నిజమైన బాల్యాన్ని ఆస్వాదించేలా, కుటుంబ బంధాలు, బలపడేలా, సోషల్ మీడియా వ్యసనం దూరమయ్యేలా చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని అన్నారు.
నెటిజన్ల మద్దతు: ఒక సామాజిక చర్చ
మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో డిజిటల్ మీడియా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భారతదేశంలో 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేదం అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ నిషేదాన్ని అమలు చేస్తున్నాయని ఇండియాలో కూడా ఈ దిశగా మార్పు చేయాలని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం రేపటి మెరుగైనా భారతదేశం కోసం మన పిల్లలను రహించాలని పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సోనుసూద్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆయన చెప్పిన మాటలకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోనూసూద్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సోషల్ మీడియా నిషేధంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.


