|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Soori: రూ.20 జీతం నుంచి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి

Published: 14-05-2025, 12:44 AM
Soori: రూ.20 జీతం నుంచి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి

తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి. రోజుకు రూ.20 జీతంతో తన జీవితాన్ని ప్రారంభించిన సూరి, కష్టపడి పనిచేసి కోట్లలో సంపాదించే నటుడిగా ఎదిగాడు. అతని జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరమైనది.

Key Points

1

రూ.20 రోజు జీతంతో ప్రారంభించిన సూరి యొక్క అద్భుతమైన ప్రయాణం.

2

కష్టపడి పనిచేసి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు.

4

వెట్రిమారన్ దర్శకత్వంలో హీరోగా లాంచ్ అయ్యి విజయవంతమైన సినిమాలు చేశాడు.

సూరి యొక్క తొలినాళ్ళ జీవితం

వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.

1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు.

కమెడియన్ నుండి హీరోగా సూరి యొక్క ప్రయాణం

అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా ‘విడుదల పార్ట్ 1’ మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. ‘మామన్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.

కోట్లలో రెమ్యునరేషన్

‘తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను’ అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

రూ.20 జీతంతో ప్రారంభించిన సూరి, తన కష్టపడి చేసిన పని ద్వారా కోట్లలో సంపాదించే స్థాయికి చేరుకున్నాడు. అతని విజయం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.