
📌 Key Points
- శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ’ సినిమాలు విడుదలకు సిద్ధం.
- రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయనే వార్తలపై శ్రీ విష్ణు క్లారిటీ ఇచ్చారు.
- విష్ణు విన్యాసం టీజర్ విడుదల కార్యక్రమంలో శ్రీ విష్ణు ఈ విషయంపై స్పందించారు.
- రెండు సినిమాలు వేర్వేరుగా విడుదల కానుండటంతో ఊపిరి పీల్చుకున్నానని శ్రీ విష్ణు తెలిపారు.
శ్రీ విష్ణు హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయనే వార్తలు వినిపించాయి. దీనిపై శ్రీ విష్ణు స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
విడుదలకు సిద్ధంగా శ్రీ విష్ణు సినిమాలు
Sree vishnu: శ్రీ విష్ణు ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విభిన్నమైన , కామెడీ నేపథ్యంలో విష్ణు సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శ్రీ విష్ణు హీరోగా విష్ణు విన్యాసం(Vishnu Vinyasam) మృత్యుంజయ (Mrityunjay) అనే సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు సాధారణంగా ఏ హీరో కూడా ఇలాంటి రిస్క్ తీసుకోరు గతంలో బాలకృష్ణ నాని లాంటి హీరోలు ఒకేసారి తమ రెండు సినిమాలను విడుదల చేశారు. ఇక శ్రీ విష్ణు కూడా ఒకేసారి తన రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఈ వార్తలను ఖండించారు. మొదట్లో రెండు సినిమాలను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ ఈ ఆలోచనను మాత్రం విరమించుకున్నారని తెలుస్తోంది.
ఒకే రోజు రెండు సినిమాలు విడుదలపై స్పష్టతనిచ్చిన హీరో
తాజాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఈ రెండు సినిమాల విడుదలపై ప్రశ్నలు ఎదురవడంతో శ్రీ విష్ణు స్పందిస్తూ తాను ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉన్నానని పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డానని తెలిపారు. మృత్యుంజయ, విష్ణు విన్యాసం సినిమాలు రెండు ఒకేసారి విడుదల కావడం లేదు. ఈ విషయానికి సంబంధించి రేపు అధికారికంగా ప్రకటించబోతున్నామని తెలిపారు.. ఇలా రెండు సినిమాలు వేరువేరుగా విడుదల కావడంతో తాను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాననే భావన కలుగుతోందని తెలిపారు.
హానెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
విడుదల గురించి శ్రీ విష్ణు ఏమన్నారంటే?
విష్ణు విన్యాసం సినిమా విషయానికి వస్తే..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మాణంలో మారుతి రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 28వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మృత్యుంజయ సినిమా విషయానికి వస్తే… హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక హానెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా ‘సామజవరగమన’ ఫేమ్ రేబా మోనికా జాన్ హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు.
శ్రీ విష్ణు రెండు సినిమాలు వేర్వేరుగా విడుదల కానుండటం ఆయన అభిమానులకు ఊరటనిచ్చే విషయమే. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


