
📌 Key Points
- ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదలకు ముందే లీక్ కావడం చిత్ర యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది.
- సినిమా లీక్ కావడంతో హడావుడిగా విడుదల చేయాల్సి వచ్చిందని హీరో శ్రీ విష్ణు తెలిపారు.
- సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినా, సినిమా లీక్ కావడం ఆగలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
- నిర్మాత ధైర్యంగా నిలబడి సినిమాను పూర్తి చేయడంతో తక్కువ సమయంలో విడుదల చేయగలిగామని శ్రీ విష్ణు అన్నారు.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల కాకముందే లీక్ అవ్వడం సంచలనం సృష్టించింది. దీనితో సినిమాను హడావుడిగా విడుదల చేయవలసి వచ్చింది. అసలు సినిమా ఎందుకు లీక్ అయింది, దాని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
సినిమా లీక్.. షాక్‌లో చిత్ర యూనిట్
Sree Vishnu: శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో హీరో శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ విషయానికి సంబంధించి ఓ విషయాన్ని తర్వాత చెబుతానని అన్నారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ ఉండగా, శ్రీ విష్ణు (Sree Vishnu) కలగజేసుకుని ‘విష్ణు విన్యాసం’ చిత్రం ఒక వారం ముందు విడుదలయ్యేలా చేశారని నిర్మాతలు చెప్పారు. అసలు అంత సడెన్‌గా ఈ మూవీని విడుదల చేయడానికి కారణం ఓటీటీనే కాకుండా మరో కారణం కూడా ఉందని ఆ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు అన్నారు. తాజాగా ఆ కారణం గురించి చెబుతూ..
‘‘మ్యాటర్ ఏంటంటే.. మేము సడెన్‌గా, ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాను రిలీజ్ చేయాలనే థాట్‌కి రావడానికి కారణం డిసెంబర్‌లో సినిమా అంతా ఎలానో లీకైపోయింది. అది ఎలా జరిగిందనేది తెలియదు. ఒక రోజు మార్నింగ్ లేచే సరికి నిర్మాత సుబ్రహణ్యం ఫోన్ చేసి.. సార్ మన సినిమా లీకైందని అన్నారు. ఆయన అలా లీకైంది అనగానే.. లీకవడం ఏంటి అని అసలు నాకేం అర్థం కాలేదు. సమ్ రాండమ్‌గా సినిమా లీకైంది.. ఎలా అయిందో తెలియదు. సైబర్ క్రైమ్‌కు కూడా కంప్లయింట్ చేశాం. అప్పటికే స్ప్రెడ్ అవడం వల్ల.. మా అందరిలో విపరీతమైన టెన్షన్ మొదలైంది. సినిమా ఇంకా పూర్తి కాలేదు.. సగమే పూర్తయింది. ఎలా.. ఏం చేయాలి? ఈ విషయం బయటకు చెబితే, వేరే విధంగా వెళుతుంది. అలా హ్యాకర్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు మా నిర్మాత ధైర్యంగా నిలబడినందుకు థ్యాంక్స్. అలాగే చాలా తక్కువ టైమ్ ఉన్నా కూడా సినిమాను పూర్తి చేశాం. లాస్ట్ వారం రోజులే మాకు ప్రమోషన్స్ చేయడానికి కూడా టైమ్ కుదిరింది.
హడావుడిగా విడుదల చేయడానికి కారణం ఇదే!
ఇలాంటి టైమ్‌లో కూడా ధైర్యంగా ఉన్న నిర్మాతను చూసి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా డేంజర్ కూడా. కరెక్ట్‌గా 6 నెలల ముందు ఒక పెద్ద సినిమాకు కూడా ఇలా జరిగిందని.. వాళ్లు, మేము మాట్లాడుకున్నాక తెలిసింది. అది కూడా పెద్ద సినిమానే. ఇది మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేసింది. ఇలాంటి టైమ్‌లో కూడా నిర్మాత చాలా ధైర్యంగా ఉన్నారు. వారికి నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతా చేశాను. చాలా వరకు సినిమా బయటకు రాకుండా, దానిని అరికట్టి, సినిమాను రిలీజ్ చేశాం..’’ అని అసలు విషయాన్ని శ్రీ విష్ణు రివీల్ చేశారు. నిజంగా ఇదంతా ఎప్పుడు జరిగిందని, అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆరు నెలల క్రితం లీకైన సినిమా ఏంటా? అని కూడా నెటిజన్లు సెర్చింగ్ మొదలెట్టారు.
మా సినిమా #VishnuVinyasam లీక్ అయ్యింది. హ్యాకర్లు నిరంతరం బ్లాక్‌మెయిల్ చేశారు.
మాకు మరో మార్గం లేక వేగంగా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.
నిర్మాత ధైర్యానికి శ్రీ విష్ణు ప్రశంసలు
ఈ పరిస్థితుల్లో మా ప్రొడ్యూసర్లకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. వారి కోసం నేను చేయగలిగినంత చేశాను- హీరో… pic.twitter.com/QWI0NEFDMY
— Sai Satish (@PROSaiSatish) February 28, 2026
సినిమా లీక్ అయినప్పటికీ, నిర్మాత చూపిన ధైర్యంతో ‘విష్ణు విన్యాసం’ విడుదలైంది. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో ఒక హెచ్చరికగా నిలిచింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆశిద్దాం.


