|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్ కోసం నా జాబ్ కూడా వదులుకున్నాను.. చాలా బాధగా ఉందంటూ షాకింగ్ విషయం చెప్పిన శ్రీజ

Published: 19-10-2025, 2:50 AM
బిగ్‌బాస్ కోసం నా జాబ్ కూడా వదులుకున్నాను.. చాలా బాధగా ఉందంటూ షాకింగ్ విషయం చెప్పిన శ్రీజ

దమ్ము శ్రీజ బిగ్‌బాస్-9 నుండి ఎలిమినేట్ కావడంతో తీవ్ర నిరాశలో ఉంది. ఈ రియాలిటీ షో కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నానని, ఒక పర్మినెంట్ టాటూ వేయించుకున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె అభిమానులు రీ ఎంట్రీ కోరుతున్నారు.

Key Points

1

దమ్ము శ్రీజ బిగ్‌బాస్-9 నుంచి ఊహించని విధంగా ఎలిమినేట్ అయి నిరాశ చెందింది.

2

బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు తన ఉద్యోగాన్ని వదులుకొని, పర్మినెంట్ టాటూ వేయించుకుంది.

4

శ్రీజ తన బాధను పంచుకున్న వీడియోపై నెటిజన్లు ధైర్యం చెబుతూ మద్దతు తెలిపారు.

బిగ్‌బాస్ నుండి శ్రీజ ఎలిమినేషన్: అభిమానుల ఆగ్రహం

సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ (dammu sreeja) కూడా ఒకరు. ఇటీవల ఆమె తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-9 (Bigg Boss-9)అవకాశం దక్కించుకుంది. ఈ షో కోసం జాబ్ కూడా మానేసి శ్రీజ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐదువారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఆమె అన్ని టాస్కుల్లో చురుగ్గా పాల్గొని తోటి కంటెస్టెంట్స్ గట్టి పోటీనిచ్చింది. అలాగే తన చలాకీ తనంతో ప్రేక్షకులను అలరించింది. కానీ గత గయ్యాలి గొంతుతో బిగ్‌బాస్‌కు చిరాకు తెప్పించింది. దీంతో ఊహించని విధంగా గత వారం ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. దీంతో కావాలనే శ్రీజను పంపేశారని ఫేక్ షో అంటూ ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అలాగే ఆమెను మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేలా బిగ్‌బాస్ చేయాలని నిర్వాహకులకు మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ వీడియోను షేర్ చేసింది. ‘‘బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వచ్చాక నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. హైపర్ ఆదిగారు పెరడీ చేస్తుంటే.. నేను హౌస్‌లో లేనని చాలా బాధగా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాడుకొని అక్కడి వరకు వెళ్లాను. బిగ్‌బాస్ కోసం ఒక పర్మినెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను.

జాబ్ వదులుకొని, టాటూ వేయించుకున్న శ్రీజ

ఈ షో కోసం నా జాబ్ కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుచు కోసం వందశాతం ప్రయత్నం చేశాను. కానీ లక్ కలిసిరాలేదు. ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా ప్రతి టాస్కులో చివరి వరకు వెళ్లా. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్స్‌లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. 5 వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండా వచ్చేశాను’’ అని కన్నీరు పెట్టుకుంటున్న వీడియోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి, ఎంతోమందికి స్ఫూర్తి మీరు బాధపడకండి అని ధైర్యం చెబుతున్నారు.

శ్రీజ భావోద్వేగ పోస్ట్: నెటిజన్ల మద్దతు

A post shared by Srija Dammu (@srija_sweetiee)

శ్రీజ బాధను అర్థం చేసుకున్న నెటిజన్లు, ఆమెకు ధైర్యం చెబుతూ మద్దతు పలకడం ప్రశంసనీయం. బిగ్‌బాస్ ప్రయాణం ముగిసినా, ఆమె కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.