
📌 Key Points
- శ్రీలీల కోలీవుడ్‌లో అజిత్ సరసన నటించే అవకాశం ఉందని సమాచారం.
- ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత అజిత్, అధిక్ రవిచంద్రన్‌తో కలిసి పనిచేయనున్నారు.
- శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సినిమా సంక్రాంతికి విడుదలైంది.
- తెలుగులో శ్రీలీలకు స్టార్ ఇమేజ్ రాకపోయినా, కోలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు కోలీవుడ్‌లో మరో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
కోలీవుడ్‌లో శ్రీలీలకు మరో అవకాశం?
Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఆమె వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటివరకు ఆమెకు స్టార్ ఇమేజ్ అయితే దక్కలేదు.. తెలుగులో మాత్రమే కాదు అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది.. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా పరాశక్తి సినిమా రిలీజ్ అయింది.. ఆ మూవీలో హీరో శివ కార్తికేయ కు జోడిగా శ్రీ లీలా నటించింది.. ఇప్పుడు కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి ఏకంగా స్టార్ హీరోతో జతకట్టబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మరి ఆ హీరో ఎవరు? ఏ మూవీలో నటించబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో అజిత్ ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో ప్రేక్షకులు ముందుకు ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాలో అజిత్ నటించబోతున్నాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ గురించి అతి త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని సమాచారం. అయితే అజిత్ కి జోడిగా హీరోయిన్ ని వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పారాశక్తి సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న శ్రీలీలను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ కాంబో కనుక ఫిక్స్ అయితే మాత్రం శ్రీ లీల ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడిపోయినట్లే అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ మూవీ గురించి అతి త్వరలోనే చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వనుందని సమాచారం..
అజిత్ కొత్త సినిమా వివరాలు
శ్రీలీల కెరీర్ అప్‌డేట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె అదృష్టం కొద్దీ స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు వస్తున్నాయి.. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ ని తీసుకురాలేదు. రీసెంట్ గా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా వరుసగా సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన పరాశక్తి మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారంలో ఉంది. వీడుతో పాటుగా తెలుగులో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అంతే కాదు. ఇటీవలే ఆమె తన డాక్టరేట్ పట్టాను అందుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి..
మొత్తానికి శ్రీలీల కోలీవుడ్‌లో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే, ఆమె కెరీర్‌కు ఇది ఒక గొప్ప మలుపు అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.


