|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: పవన్ పైనే ఆశలు.. అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు శ్రీలీల!

Published: 05-02-2026, 12:35 PM
Sreeleela: పవన్ పైనే ఆశలు.. అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు శ్రీలీల!
  • శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంది.
  • గతంలో శృతిహాసన్ కెరీర్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాతోనే మలుపు తిరిగింది.
  • శ్రీలీల ఆశలన్నీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సక్సెస్ పైనే ఉన్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ, సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా ఆమెకు ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

శ్రీలీల కెరీర్ కు సరైన సక్సెస్ ఎప్పుడు?

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ఏకంగా ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ సినిమాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలలో నటించిన శ్రీ లీల సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఈమె టాలీవుడ్ కెరియర్ అయోమయ పరిస్థితిలలో ఉంది. ఇటీవల ఈమె రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఇక శ్రీ లీల తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా పైనే శ్రీలీల టాలీవుడ్ సినీ జీవితం ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితేనే శ్రీ లీలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి లేదంటే ఈమె కెరియర్ ఇబ్బందులలో పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే కచ్చితంగా హీరోయిన్లకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. గతంలో శృతిహాసన్ కూడా శ్రీ లీల పరిస్థితిలను ఎదుర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాతో శృతిహాసన్ కు వచ్చిన గుర్తింపు

శృతిహాసన్ స్టార్ హీరో కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ కెరియర్ మొదట్లో వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొన్నారు. ఇలా ఐరన్ లెగ్ అంటూ విమర్శలను ఎదుర్కొన్న శృతిహాసన్ కు హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో శృతిహాసన్ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇలా అప్పుడు శృతిహాసన్ లాగే ఇప్పుడు శ్రీ లీలకు కూడా పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

అంచనాలు పెంచిన ఫస్ట్ సింగిల్..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే శ్రీలీల ఆశలన్నీ

ప్రస్తుతం శ్రీ లీల వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె మంచి సక్సెస్ అందుకుంటే తనకు తెలుగు ఇండస్ట్రీలో తిరుగుండదు. ఈ నేపథ్యంలోనే శ్రీ లీల పవన్ కళ్యాణ్ సినిమా పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు.. మరి ఈ సినిమా కెరియర్ కు ఎలా ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ మంచి అంచనాలను పెంచేసింది .ఇక ఈ సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మార్చ్ 26వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.

శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ఆమెకు కలిసొస్తాడేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.