
📌 Key Points
- నటుడు శివాజీ వ్యాఖ్యలతో మొదలైన నా అన్వేషణ వర్సెస్ గరికపాటి వివాదం.
- ప్రముఖ హేతువాది బాబు గోగినేని వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి అన్వేషణకు మద్దతు తెలిపారు.
- గరికపాటిది ‘నీచ భాష’ కాదా అంటూ బాబు గోగినేని సంచలన ప్రశ్న.
- బిగ్‌బాస్ షోలో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యల ఘటనను కూడా గోగినేని ప్రస్తావించారు.
టాలీవుడ్‌లో శివాజీ వ్యాఖ్యలతో మొదలైన నా అన్వేషణ వర్సెస్ గరికపాటి వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ప్రముఖ హేతువాది బాబు గోగినేని రంగంలోకి దిగి సంచలన వ్యాఖ్యలు చేశారు. గరికపాటి మాట్లాడిన భాష నీచమైనది కాదా అని ప్రశ్నిస్తూ, అన్వేషణకు మద్దతు తెలిపారు.
గరికపాటి-నా అన్వేషణ వివాదం: అసలేం జరిగింది?
Gogineni on Garikapati: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి ఇటీవల ఒక సినిమా వేడుకలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శివాజీ చేస్తున్న ఈ వ్యాఖ్యల కారణంగా ప్రస్తుతం యూట్యూబర్ నా అన్వేషణ(Naa Anveshana) వర్సెస్ గరికపాటి(Garikapati) అనే విధంగా వివాదం చెలరేగింది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై నా అన్వేషణ స్పందిస్తూ శివాజీ గరికపాటి పై మండిపడుతూ మహిళల గురించి చాలా అభ్యంతర కరంగా మాట్లాడారు. అలాగే హిందూ దేవతల గురించి , హిందువుల గురించి నా అన్వేషణ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.
ఇలా అన్వేషణ చేసిన వ్యాఖ్యలపై గరికపాటి కౌంటర్లు ఇవ్వడం గరికపాటికీ అన్వేషణ కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్వేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ప్రముఖ హేతువాది బాబు గోగినేని(Babu Gogineni) ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ వివాదం పట్ల స్పందిస్తూ అన్వేషణకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ గరికపాటి పై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా బాబు గోగినేని ఈ వివాదం గురించి మాట్లాడుతూ..
రంగంలోకి బాబు గోగినేని: తీవ్ర విమర్శలు
నా అన్వేష్ ఈ వివాదం గురించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు.” ఆడవాళ్ళ శరీరం చూస్తే..50 ఏళ్ళు దాటిన ఆగలేకపోతున్నానని” గరికపాటి చెప్పటం నీచమైన భాష కాదా? అంటూ బాబు గోగినేని ప్రశ్నించారు. ఇక నా అన్వేషణని కూడా తప్పుపడుతూ కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాషలో నియంత్రణ చాలా అవసరం అని కూడా ఈయన తెలియచేశారు. ఇలా నిత్యం వివాదాల గురించి స్పందిస్తూ బాబు గోగినేని చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటాయి.
బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా..
బిగ్‌బాస్ ఘటనపై గోగినేని సంచలన వ్యాఖ్యలు
ఇక బాబు గోగినేని బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈయన సీజన్ 2 కంటెస్టెంట్ గా కొనసాగారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలోను ఒక వ్యక్తి అమ్మాయిలను కాస్త అభ్యంతరకరంగా తాకారని ఆ అమ్మాయిలు తన వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నారని బాబు గోగినేని తెలియజేశారు. ఆ మనిషి ఎవరు అనే విషయాన్ని తాను చెప్పనని, స్వయంగా ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి నిజం ఒప్పుకోవాలంటూ గోగినేని తెలిపారు. ఇలా గరికపాటి ,అన్వేషణ వివాదం గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ పట్ల కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆ కంటెస్టెంట్ ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక అన్వేషణ గరికిపాటి వివాదంలో బాబు గోగినేని స్పందిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల గరికపాటి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఈ వివాదంలో గోగినేని ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. గరికపాటి వ్యాఖ్యలపై ఆయన చేసిన తీవ్ర విమర్శలు, బిగ్‌బాస్ ఘటనల ప్రస్తావన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇది రాబోయే రోజుల్లో మరింత దూమారం రేపే అవకాశం ఉంది.


