|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: శ్రీలీల కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్.. ఆ సూపర్ హిట్ సినిమా ఛాన్స్ పోయిందే!

Published: 19-01-2026, 1:00 AM
షాకింగ్: శ్రీలీల కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్.. ఆ సూపర్ హిట్ సినిమా ఛాన్స్ పోయిందే!
  • శ్రీలీల కెరీర్లో మరో షాక్: సూపర్ హిట్ సినిమా ‘అనగనగా ఒక రాజు’ నుంచి తొలగింపు!
  • నవీన్ పొలిశెట్టి హీరోగా, సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం!
  • కేవలం 4 రోజుల్లో రూ.80 కోట్ల వసూళ్లు సాధించిన ‘అనగనగా ఒక రాజు’!
  • శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపిక.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీలకి వరుసగా బ్యాడ్ లక్ వెంటాడుతుందా? ఒక సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ సినిమా ఏంటో, ఎందుకు ఆమెను తప్పించారో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలీలకు బ్యాడ్ లక్: సూపర్ హిట్ సినిమా ఛాన్స్ మిస్!

Sreeleela: సినిమా ఇండస్ట్రీలో విజయం సాదించాలి అంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ విజయాలు దక్కుతాయి. అలాంటి అదృష్టం లేకనే లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) వెనుకబడిపోతోంది. ధమాకా సూపర్ హిట్ తరువాత వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. కానీ, విజయాలు మాత్రం వరించలేదు అనే చెప్పాలి. మహేష్ బాబు, నితిన్, రవి తేజ, శివకార్తికేయన్ లాంటి హీరోలతో చేసిన కూడా హిట్ దక్కలేదు.

అయితే, తాజాగా శ్రీలీల గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, శ్రీలీల నటించిన సినిమాలు హిట్ కాకపోవడం కాదు రీసెంట్ గా వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా నుంచి ఆమెను తీసేశారట మేకర్స్. అదే అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది.

‘అనగనగా ఒక రాజు’ బ్లాక్ బస్టర్.. శ్రీలీల అవుట్!

నిజానికి, ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, అప్పటికే శ్రీలీలకు వరుస ప్లాప్స్ పడుతుండటంతో ఆమెను ఈ సినిమాను తప్పించారు మేకర్స్. ఆమె స్థానంలో మరో క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 4 రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నవీన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫర్.. శ్రీలీల పరిస్థితేంటి?

రానున్న రోజుల్లో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరనుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇలా ఒక సూపర్ హిట్ సినిమా నుంచి తప్పుకుంది శ్రీలీల. ఇక ఈ న్యూస్ తెలిసిన ఆమె ఫ్యాన్స్ నిజంగా శ్రీలీలది బ్యాడ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ హిట్ ఎప్పుడు కొడుతుంది అనేది చూడాలి.

శ్రీలీల ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయమే. ఆమె త్వరలోనే మంచి సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.