|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: కొత్త ఏడాదే నిరాశ.. అమ్మడి ఆశలన్నీ అటువైపే!

Published: 12-01-2026, 1:00 AM
Sreeleela: కొత్త ఏడాదే నిరాశ.. అమ్మడి ఆశలన్నీ అటువైపే!
  • శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ చిత్రం తమిళంలో ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
  • తెలుగులో విడుదల కావాల్సిన ‘పరాశక్తి’ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
  • ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ బాలీవుడ్ సినిమాపైనే ఉన్నాయి.
  • కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల బాలీవుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీలో నటిస్తోంది.

యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ మధ్య సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. తమిళ్‌లో అరంగేట్రం చేసినా అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకుంది.

తమిళంలో శ్రీలీలకు నిరాశ

Sreeleela:కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela). అందంతో, అభినయంతో, అల్లరి చేష్టలతో అందరి హృదయాలు దోచుకున్న ఈ చిన్నది ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఆరాటపడుతోంది. వాస్తవానికి ఏడాదికి ఎనిమిది సినిమాలతో రికార్డు సృష్టించిన శ్రీ లీల.. ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తోంది అనడంలో సందేహం లేదు. గత కొంతకాలంగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ని మాత్రం ఆమె అందుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదైనా సక్సెస్ చూడాలి అని ఎంతో ఆరాటపడింది శ్రీ లీల. అయితే అది కూడా ఆమెకు నిరాశ గానే మిగిలింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇన్ని రోజులు తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తొలిసారి తమిళ్ అరంగేట్రం చేసింది. అందులో భాగంగానే మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వచ్చిన చిత్రం ‘పరాశక్తి’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తమిళ్ భాషలో విడుదలైంది. నిజానికి ఈ సినిమాను జనవరి 10న తెలుగులో డబ్బింగ్ వెర్షన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ప్రభాస్ ‘ది రాజాసాబ్ ‘, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాల కారణంగా థియేటర్లు దొరక్కపోవడం , పైగా సెన్సార్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో కోలీవుడ్ అరంగేట్రం చేసిన శ్రీ లీలాకి నిరాశ తప్ప లేదని చెప్పవచ్చు. పైగా కొత్త ఏడాదే నిరాశ కలగడంతో ఆమె అభిమానులు కూడా పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారు.

తెలుగులో విడుదల వాయిదా

ఇకపోతే తెలుగులో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈమెకు నిరాశ తప్పలేదు. అలాగే అటు కోలీవుడ్ లో కూడా నిరాశే ఎదురయింది. దీంతో చేసేదేమీ లేక ప్రస్తుతం ఈమె ఆశలన్నీ బాలీవుడ్ వైపే ఉన్నాయి. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ లో ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆషీకీ 3 అని కామెంట్స్ చేస్తున్నారు కానీ చిత్ర బృందం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాతోనైనా హిందీలో నిడదొక్కుకోవాలని ఈమె ఆశిస్తోంది. మరి అక్కడైనా ఈమెకు సక్సెస్ లభిస్తుందో లేదో చూడాలి.

బాలీవుడ్‌పైనే ఆశలన్నీ

అలాగే బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా వస్తున్న మిట్టి అనే సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. మరి ఈ రెండు హిందీ చిత్రాలలో ఈమెకు ఏది తొలి చిత్రం అవుతుందో చూడాలి. తెలుగు విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మళ్లీ శ్రీ లీలా తెలుగులో ట్రాక్ ఎక్కుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శ్రీలీల ఆశలన్నీ ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉన్నాయి. అక్కడ ఈ అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. అక్కడైనా నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.