
📌 Key Points
- యాంకర్ సుమ స్థానాన్ని భర్తీ చేస్తూ శ్రీముఖి ప్రస్తుతం టాప్ యాంకర్‌గా రాణిస్తోంది.
- ఆదివారం స్టార్ మా పరివారం వంటి షోలలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో సందడి చేస్తోంది.
- తనూజ, కళ్యాణ్‌ని కలపాలని నెటిజన్లు శ్రీముఖికి క్రేజీ రిక్వెస్ట్‌లు చేస్తున్నారు.
- శ్రీముఖి గ్లామర్ డోస్ తగ్గించడంపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
స్టార్ యాంకర్ శ్రీముఖి తెలుగు టీవీలో తన హవా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నెటిజన్ల నుంచి విచిత్రమైన రిక్వెస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్‌లను కలపాలని కోరుతుండగా, ఆమె గ్లామర్ డోస్ తగ్గించడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
టాప్ యాంకర్‌గా శ్రీముఖి హవా
స్టార్ యాంకర్ శ్రీముఖి ఇప్పుడు తెలుగు టీవీకి సంబంధించి టాప్ యాంకర్‌గా రాణిస్తుంది. యాంకర్ సుమ స్థానాన్ని భర్తీ చేస్తోంది. గతంలో సుమ నెంబర్ 1గా ఉండేది. కానీ ఆమె ఇప్పుడు అన్ని షోస్ వదిలేసింది. ప్రస్తుతం ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటుంది. దీంతో ఆ స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ టీవీ షోస్ చేస్తున్న యాంకర్ శ్రీముఖినే కావడం విశేషం. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయి. అంతేకాదు స్పెషల్ ఈవెంట్లకి కూడా శ్రీముఖినే బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
దీంతో ఎక్కువగా షోస్ ఉన్న నేపథ్యంలో యాంకర్ శ్రీముఖి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తోంది. నయా దుస్తులు ధరించి కనువిందు చేస్తోంది. ఆమె గ్లామర్ విందుకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. తాజాగా ట్రెండీ గౌన్‌లో మెరిసింది శ్రీముఖి. ఫ్యాషన్‌కి అద్దం పట్టే ఈ డ్రెస్‌లో శ్రీముఖి హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది.
తనూజ, కళ్యాణ్‌ని కలపండి: నెటిజన్ల వింత డిమాండ్
ప్రస్తుతం శ్రీముఖి నయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి. దీంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నాయి. అయితే ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. గతంలో చాలా గ్లామరస్‌గా కనిపించేది శ్రీముఖి. అందాల విందు చేసేది. కానీ ఇప్పుడు తగ్గించింది. డోస్ తగ్గించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాను రాను మరీ ఇలా డోస్ తగ్గిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అందులో భాగంగానే కొందరు నెటిజన్లు శ్రీముఖిని విచిత్రమైన కోరికలు కోరుతున్నారు. తనూజ, కళ్యాణ్‌ని కలపండి అంటూ రిక్వెస్ట్ లు పెట్టడం విశేషం. కళ్యాణ్, తనూజలను తమ షోకి తీసుకురావాలని అడుతున్నారు. ఎందుకంటే శ్రీముఖి నిర్వహిస్తున్న షోస్‌లో ప్రముఖంగా ఉన్నది `ఆదివారం స్టార్ మా పరివారం`. ఈ షోకి తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, శ్రీజ, భరణి, రాము రాథోడ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, దివ్య వంటి వారు పాల్గొన్నారు. కానీ తనూజ రాలేదు.
గ్లామర్ డోస్ తగ్గించడంపై అభిమానుల ఆవేదన
ఈ నేపథ్యంలో ఆ షోని ఉద్దేశిస్తూ, ఇక్కడ శ్రీముఖికి రిక్వెస్ట్ పెడుతున్నారు. తనూజ, కళ్యాణ్ బిగ్ బాస్ షోలో క్లోజ్‌గా మూవ్ అయిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కళ్యాణ్ కూడా తనూజపై తన ఇష్టాన్ని వెల్లడించాడు. గ్రాండ్ ఫినాలే రోజు కప్ గెలిచిన తర్వాత కూడా తనూజ గురించి ప్రస్తావించాడు. ఇద్దరి మధ్య బయటకు రాని కెమిస్ట్రీ రన్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే షోలో కలిసి చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అదే రిక్వెస్ట్ ని శ్రీముఖికి తెలియజేస్తున్నారు. మరి శ్రీముఖి వారి కోరికని నెరవేరుస్తుందా అనేది చూడాలి.
శ్రీముఖి తన షోలతో, గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. అయితే, ఆమె గ్లామర్ తగ్గించవద్దని, కొన్ని ప్రత్యేకమైన రిక్వెస్ట్‌లను కూడా నెటిజన్లు ఆమె ముందు ఉంచుతున్నారు. ఇది ఆమె క్రేజ్‌కు నిదర్శనం.


