|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాకు శ్రీలంక గట్టి షాక్! లొంగేది లేదు పొమ్మన్న అధ్యక్షుడు!

Published: 20-03-2026, 5:05 PM
అమెరికాకు శ్రీలంక గట్టి షాక్! లొంగేది లేదు పొమ్మన్న అధ్యక్షుడు!
  • శ్రీలంక అధ్యక్షుడు దిస్స‌నాయకే పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.
  • అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించిన శ్రీలంక.
  • ఫ్లైట్స్ ల్యాండింగ్ కోసం వచ్చిన రెండు అభ్యర్థనలను తిరస్కరించిన శ్రీలంక.
  • మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లను విసురుతున్నందున తాము తటస్థంగా ఉంటామని ప్రకటన.

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల నడుమ శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలో ల్యాండ్ అవ్వడానికి నిరాకరించింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక అధ్యక్షుడు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు.

అమెరికా విమానాలకు అనుమతి నిరాకరణ

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా అమెరికా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 20 రోజులుగా ఈ మూడు దేశాలు కొట్టుకు చస్తున్నాయి. అయితే ఇరాన్ ను ముప్ప తిప్పలు పెట్టిన కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికాకు చుక్కలు చూపిస్తూనే ఉంది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి ఇరాన్ రూపంలో కాకుండా శ్రీలంక రూపంలో అమెరికాకు షాక్ తగిలింది.

పార్లమెంట్‌లో శ్రీలంక అధ్యక్షుడి ప్రకటన

అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్ కు పర్మిషన్ నిరాకరించింది శ్రీలంక. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక అధ్యక్షుడు దిస్స‌నాయకే ( Anura Kumara Dissanayake ) పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు. మట్టాల విమానాశ్రయంలో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీలలో అమెరికా నుంచి వచ్చిన రెండు రిక్వెస్ట్ లను రిజెక్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. తమకు ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ఒత్తిడికి లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసిరితోందని తెలిపారు. తాము న్యూట్రల్ గా ఉండేందుకు సాధ్యమైనంతగా కృషి చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు దిస్స‌నాయకే స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్య యుద్ధంపై శ్రీలంక వైఖరి

A post shared by Polimer News (@polimernews)

మొత్తానికి అమెరికాకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. ఒత్తిడులు ఉన్నప్పటికీ లొంగేది లేదని తెగేసి చెప్పడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.