
ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక, వ్యాపార సమస్యలు, విద్యార్థుల చదువులో ఇబ్బందులు సహజం. ఈ సమస్యల నుండి బయటపడటానికి, సరస్వతీ దేవి అనుగ్రహం పొందడానికి మహా మహిమాన్విత శ్రీ నీల సరస్వతీ స్తోత్రం ఒక శక్తివంతమైన మార్గం. ఈ స్తోత్ర పారాయణం వల్ల సంపూర్ణ విజయం లభిస్తుంది.
Key Points
ఆర్థిక, వ్యాపార నష్టాలు, విద్యార్థుల చదువులో ఇబ్బందులు నీల సరస్వతీ స్తోత్రంతో తొలగిపోతాయి.
సరస్వతీ దేవి అనుగ్రహం పొంది, విద్యలో రాణించడానికి ఈ స్తోత్ర పారాయణం సహాయపడుతుంది.
అష్టమి, నవమి, దశమి తిధుల్లో, ఆరు నెలలు ఈ స్తోత్రాన్ని పఠిస్తే సిద్ధి లభిస్తుంది.
జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు ఈ స్తోత్రాన్ని చదివితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
శ్రీ నీల సరస్వతీ స్తోత్రం ప్రయోజనాలు
ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. సరస్వతి దేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, వ్యాపారాలు చేసే వారికి ఈ స్తోత్రం బాగా హెల్ప్ అవుతుంది. మహా మహిమాన్విత స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చదవడం వలన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది.
ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి?
చాలా మంది విద్యార్థులు ఎంత చదివినా పరీక్షల్లో గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. అలాంటి వారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే చదువులో బాగా రాణిస్తారు. అష్టమి, నవమి, దశమి తిధుల్లో చదివితే మరీ మంచిది. ఆరు నెలలు ఈ స్తోత్రాన్ని చదివితే సిద్ధి పొందవచ్చు. ఎటువంటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది.
ఒకవేళ జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉన్నా, బుధ దశ జరుగుతున్నా చదివితే అద్భుతమైన ఫలితాలని చూడచ్చు. నీల సరస్వతీ స్తోత్రాన్ని మొదట ఎనిమిది శ్లోకాలు రోజూ ఐదు సార్లు చదువుకోవాలి. 9 నుంచి 12 శ్లోకాలను ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది. ఈ స్తోత్రం అలవాటైన వారు రోజుకి 21సార్లు పారాయణ చేస్తే మంచిది.
ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ (1)
సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ (2)
జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్(3)
స్తోత్ర పారాయణ నియమాలు, పద్ధతులు
సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోస్తు తే
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ (4)
జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ (5)
హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః
ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ (6)
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ (7)
ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ
బుధ గ్రహ దోష నివారణకు స్తోత్రం
తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ (8)
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాత్ర కార్యా విచారణా (9)
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ (10)
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే (11)
పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః (12)
నీల సరస్వతీ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, విద్యా సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. శ్రద్ధతో పఠిస్తే సరస్వతీ దేవి అనుగ్రహం పొంది, విజయం సాధించవచ్చని ఈ స్తోత్రం స్పష్టం చేస్తుంది.


