
📌 Key Points
- సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం తెరకెక్కుతోంది.
- శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా బ్రిటీషు సైనికుడిగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
- ఈ చిత్రంలో శ్రీకాంత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
- ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం నుండి శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో శ్రీకాంత్ బ్రిటీష్ సైనికుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్ లుక్
Sambarala Yetigattu: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న మోస్ట్ ఎవెటెడ్ చిత్రాలలో మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా స్పెక్టికల్ ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu) కూడా ఒకటి. ఈ సినిమాతో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ వంటి చిత్రాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. అలాగే సినిమా (SYG Movie) నుంచి వచ్చిన పోస్టర్స్ కూడా మంచి క్రేజ్ ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
‘సంబరాల ఏటిగట్టు’లో శ్రీకాంత్ పాత్ర
సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) ఇందులో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నట్లుగా మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. సోమవారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే (Happy Birthday Srikanth) సందర్భంగా ఆయన్ని బ్రిటిషు పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఇందులో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఆయన లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, మన ఇళ్లలో ఉండే పాత ఫొటోలు సగం కాలిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో.. ఈ పిక్‌ని అలా డిజైన్ చేశారు. బ్రిటీష్ అవతార్‌లో ఊర మాస్‌గా శ్రీకాంత్ ఇందులో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. శ్రీకాంత్‌కు నెటిజన్లు బర్త్‌డే విశెస్ చెబుతున్నారు.
పాన్ ఇండియా మూవీగా సంబరాల ఏటిగట్టు
ఇక సినిమా విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో రూపుదిద్దుకుంటోన్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం.. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో సాయి దుర్గా తేజ్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ లుక్, బాడీ కోసం ఆయన ఎంతగానో శ్రమిస్తూ వస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని సాయి తేజ్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


