|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీతేజ్ ఆరోగ్యం కోసం రూ.3.20కోట్లు ఖ‌ర్చు చేశారు.. బ‌న్నీ వాసు షాకింగ్ కామెంట్స్

Published: 04-12-2025, 4:50 AM
శ్రీతేజ్ ఆరోగ్యం కోసం రూ.3.20కోట్లు ఖ‌ర్చు చేశారు.. బ‌న్నీ వాసు షాకింగ్ కామెంట్స్
  • పుష్ప ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఏడాది తర్వాత కూడా పూర్తిస్థాయిలో కోలుకోక చికిత్స పొందుతున్నాడు.
  • శ్రీతేజ్ ఆరోగ్యం కోసం అల్లు అర్జున్ టీమ్ మొత్తం రూ.3.20 కోట్లు ఖర్చు చేసిందని బ‌న్నీ వాసు స్పష్టం చేశారు.
  • చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.05 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దాని వడ్డీ రూ.17 లక్షలు శ్రీతేజ్‌కు అందించారు.
  • ఇటీవలే శ్రీతేజ్ ఆస్పత్రి బిల్లు రూ.76 లక్షలను కూడా అల్లు అర్జున్ టీమ్ చెల్లించినట్లు బన్నీ వాసు తెలిపారు.

పుష్ప సినిమా తొక్కిస‌లాటలో తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీతేజ్ ఆరోగ్య ప‌రిస్థితి, చికిత్స ఖ‌ర్చుల‌పై ఇటీవల వివాదం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలో నిర్మాత బ‌న్నీ వాసు స్పందిస్తూ, అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ కోసం రూ.3.20 కోట్లు ఖర్చు చేసిందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

పుష్ప తొక్కిస‌లాట: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి

పుష్ప థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగి నేటితో స‌రిగ్గా ఏడాది పూర్తైంది. ఈ తొక్కిస‌లాటలో శ్రీతేజ్ అనే అబ్బాయి తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీతేజ్ ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వ‌ద్దే ఉంటున్నా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో చికిత్స కొన‌సాగుతోంది. అయితే శ్రీతేజ్ తండ్రి త‌న కుమారుడి చికిత్స‌కు నెల‌కు రూ.1.50ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతున్నాయ‌ని కానీ అల్లు అర్జున్ టీమ్ ను సంప్ర‌దించినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వివాదంపై టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు తాజాగా స్పందించారు. అల్లు అర్జున్ టీమ్ శ్రీతేజ్ ఆరోగ్యం కోసం మొత్తం రూ.3 కోట్ల 20ల‌క్ష‌ల 40వేలు ఖ‌ర్చు చేసింద‌ని చెప్పారు. అందులో రూ.1 కోటి 5ల‌క్ష‌ల‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసింద‌న్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయ‌గా వ‌చ్చిన రూ.17ల‌క్ష‌ల‌ను కూడా బాధితుడికే ఇచ్చార‌న్నారు. ఇటీవ‌లే రూ.76 ల‌క్ష‌ల ఆస్ప‌త్రి బిల్ ను క్లియ‌ర్ చేసిన‌ట్టు తెలిపారు. ఎలాంటి స‌మ‌స్య ఉన్నా శ్రీతేజ్ తండ్రి వ‌చ్చి త‌మ‌ను క‌ల‌వ‌చ్చ‌ని అన్నారు. ఎమైనా ఖ‌ర్చు అయినా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.

బ‌న్నీ వాసు స్పందన: అల్లు అర్జున్ టీమ్ సహాయం

ఖర్చు వివరాలు: రూ.3.20 కోట్లు ఎలా ఖర్చు చేశారు?

మొత్తంగా, శ్రీతేజ్ చికిత్సకు అల్లు అర్జున్ టీమ్ గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందించిందని బ‌న్నీ వాసు స్పష్టం చేశారు. ఈ వివరణతో చికిత్స ఖర్చుల వివాదంపై పూర్తి స్పష్టత వచ్చి, బాధితుడికి నిరంతర మద్దతు లభిస్తుందని భరోసా లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.