|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SSMB-29: ‘ఎస్ఎస్ఎంబీ-29’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్: ‘మందాకిని’గా ప్రియాంక చోప్రా

Published: 12-11-2025, 1:52 PM
SSMB-29: ‘ఎస్ఎస్ఎంబీ-29’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్: ‘మందాకిని’గా ప్రియాంక చోప్రా

మహేష్ బాబు, రాజమౌళిల ‘SSMB-29’ చిత్రం నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఆమె ‘మందాకిని’ పాత్రలో కనిపించనుంది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Key Points

1

మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘SSMB-29’.

2

ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో హీరోయిన్‌గా నటిస్తోంది.

4

ఈ పాన్ వరల్డ్ సినిమాలో పృథ్వీ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్

మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ-29’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ లవర్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ రాజమౌళి. ఇందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ‘ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ.. దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకు స్వాగతం.. మందాకిని యొక్క లెక్కలేనన్ని షేడ్స్ ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను..’ అంటూ ఇందులో ప్రియాంక మందాకి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపాడు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో రెండు కొండల మధ్యలో చేతిలో గన్‌తో పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది ప్రియాంక. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీలో పృథ్వీ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

‘మందాకిని’గా ప్రియాంక అదరహో!

పాన్ వరల్డ్ మూవీలో పృథ్వీ సుకుమారన్

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.