రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే SSMB29 సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కానున్నట్లు సమాచారం. అవతార్, ఎవెంజర్స్ సినిమాలను మించి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
Key Points
SSMB29 సినిమా 120 దేశాల్లో విడుదల కానుంది.
అవతార్, ఎవెంజర్స్ సినిమాలను మించి రిలీజ్ థియేటర్ల సంఖ్య.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడం లక్ష్యం.
SSMB29 విడుదల వివరాలు
SSMB29 : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు SSMB29 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోగా ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో జరుపుకుంటుంది.(SSMB29)
రాజమౌళి, మూవీ టీమ్ కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. ఈ క్రమంలో ముసాలియా ముదావాది తన సోషల్ మీడియాలో మహేష్ సినిమా గురించి, రాజమౌళి సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. కెన్యా అడవుల్లో, గొప్ప ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నారని తెలిపారు. అలాగే ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, 100 కోట్ల మందికి ఈ సినిమా రీచ్ అవుతుందని అన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగ్గా ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కెన్యా షూటింగ్ అప్డేట్స్
అయితే గతంలో అవతార్ సినిమా దాదాపు 100 దేశంలో రిలీజ్ చేసారు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా 106 దేశాల్లో రిలీజయింది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమాలను బీట్ చేసి మరీ మహేష్ రాజమౌళి సినిమా ఇంకా ఎక్కువ దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 120 దేశాల్లో, అన్ని ఖండాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి.
ఇప్పటికే అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారితో, ఇండియన్ కమ్యూనిటీలతో మాట్లాడి సినిమా ఆ దేశాల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే కెన్యాలో ఉన్న ఇండియా ప్రతినిధుల ద్వారానే కెన్యా ఫారిన్ మినిస్టర్ ని కలిశారట. అక్కడ షూటింగ్ చేసినందుకు ప్రభుత్వ ప్రోత్సాహాం ఉంటుందని సమాచారం.
అంతర్జాతీయ విడుదల ప్రణాళిక
అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, దుబాయ్, జపాన్, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పటికే మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మహేష్ రాజమౌళి సినిమాతో ప్రపంచం అంతా మన టాలీవుడ్ పేరు మారుమ్రోగేలా చేయబోతున్నారు.
మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB29 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం తో తెలుగు సినిమా ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఈ సినిమా అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం.


