
📌 Key Points
- సీనియర్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తన జీవితంలోని కష్టాలను పంచుకున్నారు.
- ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమయ్యానని రేఖ తెలిపారు.
- చికిత్సకు డబ్బులు కావాలని, పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఆమె అన్నారు.
- సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోతున్నాయని రేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తన జీవితంలోని కష్టాలను వెల్లడించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స కోసం డబ్బులు అవసరమని ఆమె తెలిపారు. అంతేకాకుండా, పెళ్లి సంబంధాలు కూడా కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రేఖ వేదవ్యాస్ జీవితంలో కష్టాలు
Star Actress ఇటీవల సెలబ్రిటీ ఇంటర్వ్యూల్లో.. తమ పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న కష్టాలను సైతం ధైర్యంగా చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాల వెనుక ఉన్న మెరుపుల ప్రపంచం మాత్రమే కాదు, అక్కడి కష్టాలు, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన జీవితంలోని చేదు నిజాలను.. కెరీర్ బ్రేక్ వెనుక ఉన్న కారణాలను ఓపెన్‌గా పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో.. అవకాశాల కాలం చాలా తక్కువ. అదే సమయంలో పేరు, గుర్తింపు, ఆర్థిక భద్రత సాధించాల్సి ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కొందరు ఒక్కటి రెండు సినిమాలకే పరిమితమవుతారు. మరికొందరు మంచి స్థాయిలో ఉన్నప్పుడే అనుకోని కారణాలతో ఇండస్ట్రీకి దూరమవుతారు. అలాంటి వారిలో ఒకరు ఆనందం సినిమాతో యువత మనసులు గెలిచిన హీరోయిన్ రేఖ వేదవ్యాస్.
ఆనందం సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. తరువాత కొద్ది కాలం ఇతర భాషల్లో నటించినా, చివరికి పూర్తిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్ల పాటు ఆమె ఎక్కడ ఉన్నారు, ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలతో పోరాటం
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేఖ తన జీవితం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, దాని వల్ల శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా కుంగిపోయానని చెప్పారు. సినిమాలపై ప్రేమ తగ్గలేదని, తిరిగి నటించాలని ఉందని తెలిపారు. అయితే చికిత్స ఖర్చులు, ఆరోగ్య పరిస్థితులే తన నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలిపారు.
పెళ్లి విషయంపై కూడా ఆమె ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు పెళ్లిపై ఆసక్తి లేకపోయిందని, తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదని తెలిపారు. తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా సరైన సంబంధం కావాలని ఆమె అభిప్రాయం. ఒకసారి పెళ్లి అయితే దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు.
పెళ్లిపై రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, సోషల్ మీడియా.. కార్పొరేట్ ప్రభావం పెరిగిందని రేఖ అన్నారు. ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డానంటే అది దేవుడి దయేనని చెప్పింది. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమెకు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశిస్తున్నారు.
రేఖ వేదవ్యాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని, మంచి జీవితాన్ని గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు.


