|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టేజీపై కూతురి ప్రతిభ.. ఎమోషనల్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌

Published: 11-06-2025, 11:59 PM
స్టేజీపై కూతురి ప్రతిభ.. ఎమోషనల్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌

తెలుగు సినీ నటి దేవయాని కూతురు ఇనియా తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘సరిగమప సీనియర్ సీజన్ 5’ లో ఆమె ప్రదర్శన చూసి దేవయాని ఎమోషనల్ అయ్యారు.

Key Points

1

దేవయాని కూతురు ఇనియా 'సరిగమప సీనియర్ సీజన్‌-5' లో పాల్గొంది.

2

ఇనియా అద్భుతమైన గానంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.

4

ఇనియా భవిష్యత్తులో మంచి గాయనిగా రాణించే అవకాశాలున్నాయి.

ఇనియా సరిగమపలో అరంగేట్రం

నటి దేవయాని (50) చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్‌గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్‌ ఇండియాలో పాపులర్‌ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.

దేవయాని ఎమోషనల్ రెస్పాన్స్

ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) ‘సరిగమప సీనియర్ సీజన్‌-5’ రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్‌ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో  ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్‌, టీ రాజేందర్‌, కార్తీక్‌ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్‌ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్‌ చాలా బాగుంది. భవిష్యత్‌లో మంచి సింగర్‌గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.

ఇనియా ప్రతిభకు ప్రశంసలు

టాలీవుడ్‌లో సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ,  లవ్‌ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న ‘నిళర్కుడై’ అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనున్నారు.

ఇనియా భవిష్యత్తులో మంచి గాయనిగా ఎదగడానికి అవకాశాలున్నాయని అభిమానులు భావిస్తున్నారు. దేవయాని కూతురి విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.