
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అనుభవాలను పంచుకుంది. ఒక నిర్మాత తనతో దారుణంగా ప్రవర్తించడం వల్ల ఆరు నెలలు నరకం అనుభవించినట్లు ఆమె వెల్లడించింది.
Key Points
స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
ఒక నిర్మాత చేసిన చర్యల వల్ల ఆమె 6 నెలలు నరకం అనుభవించినట్లు తెలిపారు.
బాడీ షేమింగ్, కెరీర్‌లో అడ్డంకులు ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు.
విద్యా బాలన్ సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్. అయితే ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ దీని గురించి తాము ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు. అలా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా తాను ఓ నిర్మాత చేసిన పని వల్ల 6 నెలలు నరకం అనుభవించా అని చెప్పి ఎమోషనల్ అయ్యింది. మరి ఆమె ఎవరో.. అసలు కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. స్టార్ హీరోయిన్ విద్యా బాలన్(Vidhya Balan) మనందరికీ సుపరిచితమే. ‘డర్టీ పిక్చర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
క్యాస్టింగ్ కౌచ్ అనుభవం
ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా, చండాలంగా పిలిచాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఆ అవమానంతో నేను దాదాపు ఆరు నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఆ మాటలు నన్ను ఎంత బాధపెట్టాయంటే నేను ఆరు నెలల పాటు నరకం అనుభవించా.
నిర్మాత దారుణ ప్రవర్తన
ఆ మాటలకు నేను మనిషిని కాలేకపోయా. అయితే ఇలాంటి సంఘటనలు నా కెరీర్‌లో చాలానే జరిగాయి. అదే టైంలో బాడీ షేమింగ్ కూడా చేశారు. ఇక ఆ టైంలోనే నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో అందరూ నన్ను దురదృష్టవంతురాలు అన్నారు. ఎదో కారణంతో సినిమా ఆగిపోతే దానికి నేను కారణం అన్నారు. ఇలాంటివి నా కెరీర్‌లో చాలా జరిగాయి’ అని ఎమోషనల్ అయింది విద్యా బాలన్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
విద్యా బాలన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై మరోసారి చర్చను రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘటనలు మహిళలకు ఎదురయ్యే కష్టాలను ప్రతిబింబిస్తున్నాయి.


