|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Stranger Things 5: కొత్త సీజన్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన

Published: 01-06-2025, 9:12 AM
Stranger Things 5: కొత్త సీజన్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రముఖమైన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మూడు భాగాలుగా విడుదల కానున్న ఈ సీజన్ ఎప్పుడు విడుదల అవుతుందో చూద్దాం.

Key Points

1

స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ మూడు భాగాలుగా విడుదల

2

నవంబర్ 26న వాల్యూమ్ 1, డిసెంబర్ 25న వాల్యూమ్ 2, జనవరి 1న ఫైనల్ ఎపిసోడ్

4

అధికారిక ప్రకటనతో పాటు ఓ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్

స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ విడుదల తేదీలు

గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్‌లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ‘స్ట్రేంజర్ థింగ్స్’. నెట్‌ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్‌ల్లో ఇది కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.

ఇప్పటివరకు ‘స్ట్రేంజర్ థింగ్స్’ నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.

మూడు భాగాలుగా విడుదల

ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న ‘వాల్యూమ్ 1’, క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ‘వాల్యూమ్ 2’, న్యూఇయర్ కానుకగా జనవరి 1న ‘ఫైనల్ ఎపిసోడ్’ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.

అధికారిక ప్రకటన మరియు ట్రైలర్

‘స్ట్రేంజర్ థింగ్స్’ విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్‌గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.

చివరికి స్ట్రేంజర్ థింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. మూడు భాగాలుగా విడుదల కానున్న 5వ సీజన్‌ని ఆశగా ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.