|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Subhashree Rayaguru : వారం రోజుల్లో లవ్.. 9 నెలల్లో ఎంగేజ్మెంట్.. బిగ్ బాస్ శుభశ్రీ లవ్ స్టోరీ గురించి తెలుసా?

Published: 28-06-2025, 12:51 PM
Subhashree Rayaguru : వారం రోజుల్లో లవ్.. 9 నెలల్లో ఎంగేజ్మెంట్.. బిగ్ బాస్ శుభశ్రీ లవ్ స్టోరీ గురించి తెలుసా?

బిగ్ బాస్ తెలుగు షో ద్వారా పేరు తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు తన ప్రేమకథను బయటపెట్టింది. ఒక సాంగ్ షూట్ లో కలిసిన ఆమె, అజయ్ మైసూర్ తో వారం రోజుల్లోనే ప్రేమలో పడి, తొమ్మిది నెలల తర్వాత నిశ్చితార్థం చేసుకుంది.

శుభశ్రీ రాయగురు ప్రేమకథ

Subhashree Rayaguru : తెలుగులో బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది ఒడిశా భామ శుభశ్రీ రాయగురు. ప్రస్తుతం పలు మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తెలుగు నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని నిశ్చితార్థం చేసుకుంది.

తాజాగా శుభశ్రీ రాయగురు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ గురించి తెలిపింది.

వారం రోజుల్లో ప్రేమ పుట్టుక

శుభశ్రీ రాయగురు మాట్లాడుతూ.. సాంగ్ షూట్ కోసమే మేము మొదటసారి కలిసాం. ఆయనే ప్రొడ్యూసర్, మెయిన్ లీడ్. మొదటిసారి కలిసినప్పుడు వర్క్ గురించి మాట్లాడాము. మంచి అబ్బాయి అనుకున్నాను. వారం రోజులు షూట్ చేసాం. ఆ వారం రోజులలోనే లవ్ అయింది. చిన్న చిన్న విషయాలతో ఆయన నన్ను స్పెషల్ ఫీల్ అయ్యేలా చేసారు. నాకు డౌట్ వచ్చింది. ఆయన చేసే చిన్న చిన్న పనులు నాకు నచ్చాయి. లాస్ట్ డే షూట్ లో నాకు కూడా ఆ ఫీల్ వచ్చింది. లాస్ట్ డే షూట్ లో ఆయనే మొదట ప్రపోజ్ చేసారు. ఆయన ప్రపోజ్ చేయగానే చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసారు. అది నేను ఎంజాయ్ చేశాను. అలా మా లవ్ మొదలైంది. ఇప్పటికి 9 నెలలు మా లవ్ కి. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పాము. ఆయన ఇక్కడికి వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడారు. అందరితో మాట్లాడి ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నాము అని తెలిపింది.

నిశ్చితార్థం విశేషాలు

చివరగా, శుభశ్రీ రాయగురు తన వారం రోజుల ప్రేమ, తొమ్మిది నెలల ప్రయాణం తర్వాత నిశ్చితార్థం గురించి పంచుకున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారి ప్రేమ జీవితం సుఖంగా సాగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.