|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను చేసిన క్యారెక్టర్.. ఇప్పటి వరకూ ఏ హీరో చేయలేదు: సుధీర్ బాబు

Published: 02-11-2025, 4:59 PM
నేను చేసిన క్యారెక్టర్.. ఇప్పటి వరకూ ఏ హీరో చేయలేదు: సుధీర్ బాబు

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన ‘జటాధర’ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ, తాను చేసిన క్యారెక్టర్ ఇంతవరకు ఏ హీరో చేయలేదని, తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా పంచుకున్నారు.

Key Points

1

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన 'జటాధర' నవంబర్ 7న విడుదల.

2

తాను చేసిన క్యారెక్టర్ ఇంతవరకూ ఏ హీరో చేయలేదని సుధీర్ బాబు వెల్లడించారు.

4

మహేష్ బాబు అల్లుడిగా, కృష్ణ గారి బావగా తన గుర్తింపును ప్రేమగా స్వీకరించాడు.

‘జటాధర’ విడుదల తేదీ, చిత్ర బృందం

నవ దళపతి సుధీర్ బాబు(Sudheer Babu), సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ మూవీని శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా.. మూవీ మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సుధీర్ బాబు మాట్లాడుతూ..‘‘కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు గారి బావ. ఇది నేను గర్వంగా ప్రేమగా ఒప్పుకుంటున్నాను. నేను యాక్టర్ అవ్వాలనుకున్న మూమెంట్ తలుచుకుంటే భయమేస్తుంది. యాక్టర్ అవ్వాలని కోరికనే పర్మినెంట్‌గా చంపేయాలనుకున్నాను. ఎందుకంటే కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. యాక్టర్‌గా సక్సెస్ అవుతానా? ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలా చాలా భయాలు ఉండేవి. కాకపోతే నేను మొండి వాడిని. కృష్ణ గారి అల్లుడు, మహేష్ గారి బావగానే ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఎంతోమంది నిర్మాతలను కలిసాను.

సుధీర్ బాబు సినీ ప్రయాణం, కష్టాలు

అడిషన్స్ ఇచ్చాను. యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్‌కి తిరిగాను. నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా‌గా ఒక కాఫీ మాత్రమే. కృష్ణానగర్ కష్టాలు తెలియకకోవచ్చు కానీ ఫిలింనగర్ బాధలు తెలుసు. తిండి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ, కళ్ళ ఎదురుగా తిండి ఉండి నిరాశతో ముద్ద దిగని ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు. ఇవన్నీ నేను సింపతి కోసం చెప్పట్లేదు. అలా అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పేవాడిని. ఇప్పుడు నాకు సింపతీ అవసరం లేదు. ప్రేమ గౌరవం చాలు. మీరందరూ మహేష్ బాబు గారిపై ప్రేమతోనే వచ్చారు. అందరికీ థాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారు. నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారు. నాకు మనసుకు తెలుస్తుంది. ఎవరో ఒకరు నా కోసమైతే వచ్చారు. మీ కష్టపడతాను.

మహేష్ బాబు అల్లుడిగా నా గుర్తింపు

కానీ ఆ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తాను. గెలిచే వరకు కూడా పోరాడాలి. లేదా చచ్చే వరకు పోరాడాలి. జటాధరలో డైలాగ్ ఇది. నా రియల్ లైఫ్ లో కూడా యూజ్ అవుతుంది. మహేష్ గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా ఏ ఒక్క రోజు కూడా హెల్ప్ చేయమని అడగలేదు. జటాధర నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ సినిమా దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్మేవారికి, లేవని నమ్మేవారికి ఇద్దరికీ సమానంగా నచ్చుతుంది. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ తో చెప్పడం జరిగింది. నవంబర్ 7న అందరూ రెడీ అయిపోండి’’ అని అన్నారు.

సుధీర్ బాబు తన సినీ ప్రయాణంలోని కష్టాలను, ‘జటాధర’లో తన పాత్ర ప్రత్యేకతను పంచుకున్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం, నటనను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో నవంబర్ 7న తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.