|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రష్మీతో సుధీర్ తెగతెంపులు! ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్!!

Published: 12-01-2026, 2:30 AM
షాకింగ్: రష్మీతో సుధీర్ తెగతెంపులు! ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్!!
  • సుధీర్, రష్మి లవ్ ట్రాక్‌పై క్లారిటీ ఇచ్చిన సుధీర్ – అభిమానుల్లో నిరాశ!
  • ఈటీవీ ‘కమ్ టు ఢీ పార్టీ’లో జర్నలిస్ట్ జాఫర్‌తో ముచ్చట్లు.
  • సుధీర్ హీరోగా బిజీ కావడంతో జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే!
  • శ్రీదేవి డ్రామా కంపెనీలో అడపాదడపా మెరిసిన ఈ జంట!

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ లవ్ ట్రాక్‌పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. తాజాగా సుధీర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రష్మి, సుధీర్ లవ్ ట్రాక్ ముగిసిందా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్లుగా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్‌ హీరోగా, హైపర్‌ ఆది వంటి వారు కమెడియన్లుగా అదరగొడుతున్నారు. గెటప్‌ శ్రీను అన్ని రకాల పాత్రలతో మెప్పిస్తున్నాడు. అయితే ఈ షో చాలా కమెడియన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ని క్రియేట్‌ చేసింది. రాకేష్‌, సుజాత ఏకంగా పెళ్లి చేసుకున్నారు. కానీ సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి మధ్య లవ్‌ ట్రాక్‌ మాత్రం పాపులర్‌ అయ్యింది. వీరి జంటనే షోకి క్రేజ్‌ని, టీఆర్‌పీ రేటింగ్‌ని తెచ్చిపెట్టింది. వీరిద్దరి విడిపోయాక షోకి ప్రభావం తగ్గిపోయిందని చెబితే అతిశయోక్తి కాదు.

యాంకర్‌ రష్మి, సుడిగాలి సుధీర్‌ తమ ప్రతి స్కిట్‌లో ఏదో రకంగా కెమిస్ట్రీ పలికిస్తూ మెప్పించారు. ట్విస్ట్ లు, టర్న్ లతో తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటూ, తమ లవ్‌ ట్రాక్‌ని నడిపిస్తూ పాపులర్‌ అయ్యారు. స్కిట్‌ కోసం చేసిన లవ్‌ ట్రాక్‌ లు కూడా నిజమే అనేంతగా రక్తికట్టించారు. వీరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే నిజంగానే ప్రేమలో ఉన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. దీంతో వీరికి సెపరేట్‌గా ఫ్యాన్‌ బేస్‌ కూడా ఏర్పడింది.

సుధీర్ క్లారిటీతో ఫ్యాన్స్ నిరాశ!

కానీ అనూహ్యంగా మూడేళ్ల క్రితం ఈ ఇద్దరు విడిపోయారు. సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ ని వదిలేశారు. ఆయనకు హీరోగా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ని పక్కన పెట్టాడు. హీరోగా కొన్ని సినిమాలతో సక్సెస్‌ అయ్యాడు. కానీ ఫెయిల్యూర్స్ గట్టి దెబ్బ కొట్టాయి. దీంతో మళ్లీ ఆయన టీవీ షోస్‌ చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత రష్మి, సుధీర్‌ మాత్రం కలవలేదు. అడపాదడపా శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్‌ ఎపిసోడ్స్ లో మెరిశారు తప్పితే, కలిసి షోస్‌ చేయలేదు. కానీ ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఉందనేలానే మ్యానేజ్‌ చేస్తూ వచ్చారు. అభిమానులు వీరు కలవాలని కోరుకుంటున్నారు. నిజంగానే వీరి మధ్య లవ్‌ ట్రాక్‌ ఉందా? అది కేవలం షోకే పరిమితమా? అనే విషయం క్లారిటీ లేక ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

తాజాగా దీనిపై స్పందించాడు సుడిగాలి సుధీర్‌. రష్మితో తెగతెంపుల విషయాన్ని వెల్లడించారు. ఇటీవల న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ఈటీవీలో కమ్‌ టూ ఢీ పార్టీ పేరుతో ఒక స్పెషల్‌ ఎపిసోడ్‌ని నిర్వహించారు. ఇందులో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్‌ హాజరయ్యారు. ఆయన హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఈ అమ్మాయిల గోలేంటి? రష్మితో ఆ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అని ప్రశ్నించాడు. దీనికి సుధీర్‌ క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య ఇప్పుడు లవ్‌ ట్రాక్‌ లేదని, లవ్‌ స్టోరీ ముగిసిందని ప్రకటించాడు. ఆ లవ్‌ ట్రాక్‌ కేవలం షో వరకే పరిమితమని, ఇప్పుడు ఎలాంటి ట్రాక్‌ లేదని కుండబద్దలు కొట్టాడు. మొత్తంగా రష్మితో లవ్‌ ట్రాక్‌ విషయంలో తెగతెంపులు జరిగినట్టు వెల్లడించారు.

‘కమ్ టు ఢీ పార్టీ’లో అసలు విషయం బయటపెట్టిన సుధీర్!

గతంలోనూ రష్మి, సుధీర్‌ స్పందిస్తూ, తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. తమ బాండింగ్‌ చాలా స్పెషల్‌ అని తెలిపారు. ఎప్పటికీ అలా ఫ్రెండ్స్ గానే ఉండిపోతామనేలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు దీనిపై సుధీర్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు షోలోనే ఉన్న రాంప్రసాద్‌ సైతం వీరి మధ్య ఏం లేదని స్పష్టం చేశారు. హైపర్‌ ఆది కూడా అదే విషయాన్ని హింట్‌ ఇచ్చాడు. మొత్తంగా సుధీర్‌, రష్మి లవ్‌ స్టోరీ అన్ని రకాలుగా ముగిసిపోయిందనే విషయం స్పష్టమవుతుంది.

సుధీర్, రష్మి లవ్ స్టోరీపై సుధీర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.