|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ అప్డేట్: ‘హే బలవంత్’ రిలీజ్ డేట్ ఫిక్స్! సుహాస్ కామెంట్స్ వైరల్!

Published: 18-02-2026, 10:05 AM
మాస్ అప్డేట్: 'హే బలవంత్' రిలీజ్ డేట్ ఫిక్స్! సుహాస్ కామెంట్స్ వైరల్!
  • సుహాస్, శివానీ నాగరం జంటగా ‘హే బలవంత్’ మూవీ ఫిబ్రవరి 20న విడుదల!
  • నరేష్, స్రవంతి కీలక పాత్రల్లో నటన, గోపీ అచ్చర దర్శకత్వం!
  • వంశీ నందిపాటి: ఆడియన్స్‌కు పైసా వసూల్ సినిమా!
  • సుహాస్: ‘హే బల్‌వంత్‌’తో నాకు పెద్ద హిట్ వస్తుందని నమ్మకం!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ‘హే బలవంత్’ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుహాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఫిబ్రవరి 20న ‘హే బలవంత్’ విడుదల!

సుహాస్(Suhas), శివానీ నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హే బలవంత్’(hey balwanth). ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్(Naresh), యాంకర్ స్రవంతి కీలక పాత్రలో మెప్పించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌, నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించగా.. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘‘డేట్‌లు మారినా, టైటిల్‌ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్‌ చేసే ఇంపాక్ట్‌ మారదు. ఈ మూవీ చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ఆడియన్సకు పైసా వసూల్‌ సినిమా. హాండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే సినిమా ఇది’’ అన్నారు.

నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌ నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్. ఇరవై కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చి. త్వరితగతిన షూటింగ్‌ పూర్తిచేశామని తెలిపారు. సుహాస్‌ మాట్లాడుతూ ”టీమ్‌ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నా తోటి ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ పెట్టారు. నా కెరీర్‌లో మజిలీ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో ఓ సినిమాలో ఆఫర్‌ వచ్చింది. అందులో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. నా ముందే ఒకాయన సెట్‌లో ఇంతనెందుకు పిలిచారు? కానీ కట్‌ చేస్తే కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశాను. నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్‌ అది. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే మీరు నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక ‘హే బల్‌వంత్‌’తో నాకు పెద్ద హిట్‌ వస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

సుహాస్ కెరీర్ బ్రేక్ గురించి షాకింగ్ కామెంట్స్!

టీమ్ కాన్ఫిడెన్స్.. హిట్ కొట్టేలా ఉందే!

సుహాస్ ‘హే బలవంత్’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టీమ్ ఎంతో నమ్మకంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.