
సుహాస్ నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదలైంది. మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ట్రైలర్‌లో కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి.
Key Points
సుహాస్ మరియు మాళవిక మనోజ్ నటించిన 'ఓ భామ అయ్యో రామ' ట్రైలర్ విడుదల.
నవ్వించే కామెడీతో పాటు, హృద్యమైన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.
హరీష్ శంకర్ మరియు మారుతి అతిథి పాత్రల్లో నటించారు.
జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ విడుదల
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్ తాజాగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ఓ భామ అయ్యో రామ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. శనివారం (జులై 5) ఓ భామ అయ్యో రామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ.. “ట్రైలర్ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ చూసిన వారు ఈచిత్రం షూర్ షాట్ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది” అని అన్నారు.
నవ్వించే కామెడీ, హృద్యమైన ఎమోషన్స్
“హీరో సుహాస్, మాళవిక మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది” అని హరీష్ నల్ల తెలిపారు.
“జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది” అని హరీష్ నల్ల పేర్కొన్నారు.
ఇక ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను గమనిస్తే.. నవ్వించే కామెడీ సీన్లతోపాటు ఏడిపించే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, హీరో, హీరోయిన్స్ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.
ప్రముఖ దర్శకుల అతిథి పాత్రలు
హీరోను హీరోయిన్ శ్మశానంలో కూర్చోబెట్టడం, పక్కనే చేతబడి ముగ్గు చూసి హీరో భయపడటం వంటి సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్స్ హరీష్ శంకర్ , మారుతి అతిథి పాత్రలో కనిపించి అలరించారు.
కాగా, మణికందన్ సినిమాటోగ్రఫీని అందించిన ఓ భామ అయ్యో రామ సినిమాకు రథన్ సమకూర్చారు. బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
సుహాస్ మరియు మాళవిక మనోజ్ నటనతో పాటు, ప్రముఖ దర్శకుల అతిథి పాత్రలు ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. జూలై 11న విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం.


